Advertisement
Google Ads BL

సౌత్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్న మృణాల్


తెలుగులోనే కాదు సీతారామం చిత్రంతో  సౌత్ లోని ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్  స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో సీతగా ప్రేక్షకులను మెప్పించిన మృణాల్ ఇప్పుడు బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో కూడా తన కెరీర్‌ను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

Advertisement
CJ Advs

దానికి తగ్గట్టే సౌత్ సైడ్ నుంచి ఎన్నో కథలను వింటోంది ఈ హీరోయిన్. అయితే మొదటి సినిమానే దక్షిణాదిలో సీతారామంలోని క్లాసిక్ చిత్రాన్ని ఎంచుకోవడంతో ఈ హీరోయిన్ తదుపరి ప్రాజెక్టుల పైన కూడా తన ఫ్యాన్స్ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. మృణాల్ తప్పకుండా మంచి క్యారెక్టర్స్ ని ఎంచుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఏదో ఒక సినిమా ఒప్పుకోకుండా ఫైనల్ గా ఈమధ్య తెలుగులో తన రెండోవ చిత్రాన్ని Nani30 గా ప్రకటించింది ఈ హీరోయిన్. 

మృణాల్ ఇటీవలే నానితో సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది అలానే ఈ చిత్రం రెండోవ షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానందుగా ప్రస్తుతానికి విరామం తీసుకుంటొంది. ఈ నేపథ్యంలో మృణాల్ హైదరాబాద్‌లో ఇల్లు కొన్నారని మరియు ఆమెకు చాలా ఆఫర్లు వస్తూ ఉండటంతో ఇక్కడ స్థిరపరాలి అనుకుంటున్నారని వార్తలు జోరున ప్రచారం జరుగుతున్నాయి. మృణాల్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో దక్షిణాదిలో తనను తాను స్థాపించుకోవడానికి దక్షిణాదిలోని ప్రముఖ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అయిన బెంచ్‌మార్క్ టాలెంట్స్‌తో జతకట్టినట్లు కూడా పంచుకున్నారు.

ఇక తాజా అప్‌డేట్ ప్రకారం, మన సీతకి తమిళ్ ఇంకా మలయాళం ఇండస్ట్రీల నుంచి కూడా ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. అక్కడ కూడా మంచి సినిమాతో తన అరంగేట్రం చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నదట. అందుకే అక్కడ దర్శకుల కథలు కూడా వింటూ ఉన్నట్టు త్వరలోనే తన తమిళం లేదా మలయాళీ సినిమా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ప్రముఖ తమిళ హీరో సూర్య సినిమా అయినా సూర్య 42లో మృణాల్‌కు కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. అయితే అధికారిక ఇంకా రాలేదు. ఇది కానీ నిజమైతే తమిళంలో మాత్రం ఈ హీరోయిన్ సూర్య సినిమాతో అరంగేట్రం చేయొచ్చు.

Tamil and Malayalam offers for Mrunal Thakur?:

Mrunal Thakur shifts focus to South
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs