Advertisement
Google Ads BL

ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు లోగో


యు.మేఘనాథ్, యం లోకేష్ కుమార్  సమర్పణలో Lol ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఇంద్ర, కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ, ఇమ్రాన్, సీతల్ బట్ నటీ నటులుగా  లక్ష్మణ్ జెల్ల దర్శకత్వంలో చంద్రాస్ చంద్ర, డాక్టర్ విజయ రమేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు.. ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర యూనిట్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు మోషన్ లోగోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏ. పి అడిషనల్ అడ్వకెట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, తెలంగాణ యఫ్. డి. సి. ఛైర్మెన్ అనిల్ కుర్మాచలం, డైరెక్టర్ రాజు యాదవ్, సీనియర్ నటి జయలక్ష్మి, తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర  మోషన్ లోగో ను లాంచ్ చేశారు .

Advertisement
CJ Advs

యఫ్. డి .సి. ఛైర్మెన్ అనిల్ కుర్మా చలం మాట్లాడుతూ.. సినిమాలు చూస్తూ పెరిగిన నాకు యఫ్. డి .సి. ఛైర్మెన్  పదవి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన కె. సి. ఆర్, కె. టి. ఆర్ లకు నా ధన్యవాదాలు. చంద్ర గారు నాకు లండన్ లో మంచి ఫ్రెండ్ గా ఉండేవారు. ఆ తరువాత నేను ఇండియాకు వచ్చి సినిమా తీయడం జరిగింది. తను తీసిన ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇస్తున్నాడు. ఇప్పుడు తను చేస్తున్న ఈ సినిమా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహం ప్రేమ సహజంగా ఉంటాయి. కానీ ప్రేమ అనేది పదిమందిలో గర్వంగా చెప్పుకోలేనిది. కానీ స్నేహం మాత్రం సగర్వంగా వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకునేది గా ఉంటుంది.అలాంటి స్నేహాన్ని కొత్తగా గొప్పగా  చెప్పాలని ఈ కథ ను తీసుకున్నాం. ప్రేమకు ఉన్న విలువలు, స్నేహానికి ఉన్న గొప్పతనం రెండు బ్యాలెన్స్ చేసి ఈ సినిమాలో చూయించాం. ఈ కథ తప్పకుండా ప్రతి ఒక్క యూత్ కి కనెక్ట్ అవుతుంది  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నాం అని అన్నారు. 

మరో చిత్ర నిర్మాత డా. రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్ర శేఖర్ నేను 6 వ తరగతి నుండి  క్లోజ్ ఫ్రెండ్. చంద్ర శేఖర్ లండన్ నుంచి వచ్చిన తరువాత ఫ్రెండ్షిప్ మీద సినిమా తీద్దామనుకొని కథలు వింటున్న మాకు లక్ష్మణ్ చెప్పిన కథ మాకు బాగా కనెక్ట్ అయ్యి తీసిన సినిమానే ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు. సినిమా బాగా వచ్చింది. చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు లక్ష్మణ్ జెల్ల మాట్లాడుతూ.. లవ్ లో బ్రేక్స్ చూశాము, కానీ ఫ్రెండ్షిప్ లో బ్రేక్స్ చూడలేదు. ప్రతి మనిషి జీవితంలో లవ్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. ఫ్రెండ్షిప్ కు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలనే తెలియజేసే చిత్రమే ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు. రియల్ జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ను కథగా రాసుకున్న నేను నిర్మాతలు చంద్రాస్ చంద్ర, డాక్టర్ విజయ రమేష్ రెడ్డి లకు చెప్పిన వెంటనే  నువ్వు చెప్పిన కథ బాగుంది. ఇందులో మంచి ఏమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న యూత్ కు కూడా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఈ కథ కచ్చితంగా ట్రెండ్ ను సెట్ చేస్తుందని ఈ కథను ఒకే చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఇది కొత్త ఆర్థిస్టులు అని మీకు ఎక్కడా అనిపించకుండా మీకు ఎమోషన్ తో పాటు ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. నన్ను నమ్మి ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు.

ఏ. పి అడ్వకెట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లండన్ లో హ్యాపీ గా ఉన్న తను సినిమా తియ్యాలనే కళా తపస్సు తనలో ఉండడంతో ఇండియాకు వచ్చి ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అనే చక్కని సినిమా తీశాడు. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

చిత్ర హీరో ఇంద్ర మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో  నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. మంచి కథతో వస్తున్న ఈ స్టోరీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎమోషన్ క్యారీ  చేస్తుంది.సినిమా చాలా బాగా వచ్చింది. చూసిన వారందరికీ ఈ సినిమా నచ్చుతుంది.

మరో హీరో ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఫ్రెండ్షిప్ మీద  తీసిన ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు చిత్రం ప్రతి ఒక్కరి మనషులను గెలిచే చిత్రంగా నిలుస్తుంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు 

చిత్ర హీరోయిన్ కోమల్ నాయర్ మాట్లాడుతూ.. ఇది చాలా బ్యూటిఫుల్ స్టోరీ.. ఫ్రెండ్షిప్ మీద తీసినటువంటి ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరు మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి ఆన్నారు 

నటీ నటులు: సీనియర్ నటి ఆమని ఇంద్ర, దీపు, ఇమ్రాన్, కోమల్ నాయర్, స్వాతి శర్మ, సీతల్ బట్, కునాల్ శర్మ తదితరులు 

నిర్మాతలు : చంద్ర యస్ చంద్ర, డాక్టర్ విజయ రమేష్ రెడ్డి, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ : లక్ష్మణ్ జెల్ల.

Trend Maarina Friend Maaradu movie logo Launch:

Trend Maarina Friend Maaradu movie logo Launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs