Advertisement
Google Ads BL

మౌనిక కొడుకు బాధ్యతలు తీసుకున్న మనోజ్


మంచు మనోజ్ మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడం మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు కి అస్సలు నచ్ఛలేదు. ఇంటర్ క్యాస్ట్ మేరేజ్ మోహన్ బాబు కి అభ్యంతరం లేకపోయినా.. మౌనిక రెడ్డికి ఒక బాబు ఉండడమే ఆయనకి అసలైన అభ్యంతరం. మంచు మనోజ్ కి రెండో వివాహమే. కాకపోతే ఆయనికి పిల్లలు లేరు. కానీ మౌనిక రెడ్డికి మొదటి భర్త తో విడాకులు రావడమే కాకుండా, మొదటి భర్త తో ఓ కొడుకు ఉండడమే మంచు ఫ్యామిలీకి నచ్చలేదు. అయినా మనోజ్ మొండిగా పెళ్లి చేసుకోవడం మంచు ఫ్యామిలీకి నచ్చకపోయినా.. మోహన్ బాబు కొడుకుని కోడలిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. 

Advertisement
CJ Advs

మంచు లక్ష్మి తమ్ముడి వివాహాన్ని తన భుజాన ఎత్తుకుని అన్ని కార్యక్రమాలు దగ్గరుండి పూర్తి చేసింది. దానితో అక్కకి జీవిత కాలం రుణపడి ఉంటానంటూ థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసాడు మనోజ్. ఇక మనోజ్ పెళ్లి తర్వాత భార్య మౌనిక, ఆమె ఆమె కుమారుడితో కలిసి ఫొటోలకి ఫోజులివ్వడమే కాకుండా.. మౌనిక కొడుకు ధైరవ్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ఓ పిక్ తో క్లారిటీ ఇచ్చాడు. 

మంచు మనోజ్ పెళ్లి తర్వాత మౌనిక, ఆమె కొడుకు ధైరవ్ చేతులలో తన చేతులు ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. మౌనిక కొడుకు బాధ్యతలు తీసుకోవడం శివుడి ఆజ్ఞ అన్నట్టుగా..  శివుని ఆజ్ఞ 🙏🏼❤️ #MWedsM #ManojWedsMounika అంటూ ట్వీట్ చేసాడు. అంతేకాకుండా మనోజ్-మౌనిక పెళ్లి లో కూడా ధైరవ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

Manchu Manoj Shares Interesting Photo of His Wedding :

Manchu Manoj took charge of Mounika Reddy son Dhairav
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs