Advertisement
Google Ads BL

ఏప్రిల్‌ 7న కిరణ్‌ అబ్బవరం మీటర్‌


మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో కిరణ్‌ అబ్బవరం హీరోగా క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్నున్న మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మీటర్‌ ఏప్రిల్‌ 7న విడుదల. వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న యంగ్‌ టాలెంటెడ్‌ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం. ఇటీవల వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మీటర్‌. టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్‌ కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 7న వేసవిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. 

Advertisement
CJ Advs

ఈ  సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. కిరణ్‌ అబ్బవరంతో నిర్మిస్తున్న పక్కా కమర్షియల్‌ సినిమా ఇది. ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఆయన లుక్‌, పాత్ర అన్ని కొత్తగా వుంటాయి. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. ఏప్రిల్‌ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు. 

అతుల్య రవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్‌, డీఓపీ: వెంకట్‌.సి.దిలీప్‌ అండ్‌ సురేష్‌ సారంగం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: జేవీ, సంభాషణలు: రమేష్‌ కాదూరి, సూర్య, లైన్‌ ప్రొడ్యూసర్‌: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబా సాయి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సురేష్‌ కందులు, మార్కెటింగ్‌: ఫస్ట్‌ఫో, పబ్లిసిటి: మ్యాక్స్‌ మీడియా, పీఆర్‌ఓ: వంశీ శేఖర్‌, మడూరి మధు, సమర్పణ: నవీన్‌ ఎర్నేనీ, రవి శంకర్‌. యలమంచిలి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రమేష్‌ కాదూరి.

Meter Movie Releasing On April 7th:

<span><span>Mythri Movie Makers Presents&nbsp;</span>Meter Movie Releasing April 7th</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs