Advertisement
Google Ads BL

నాని బర్త్ డే: దసరా స్పెషల్ గ్లింప్స్


ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న నేచురల్ స్టార్ నానికి అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా నాని పాన్ ఇండియా చిత్రం దసరా’ మేకర్స్ మాస్ అప్పీలింగ్ పోస్టర్‌ తో పాటు గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు. పోస్టర్‌లో లుంగీ కట్టుకున్న నాని కళ్ళజోడు ధరించి బీడీ తాగుతూ ఊర మాస్‌గా ఆకట్టుకున్నారు. ధరణిని ఘనంగా స్వాగతిస్తున్న డప్పు దరువులు కూడా పోస్టర్‌లో అలరిస్తున్నాయి.

Advertisement
CJ Advs

గ్లింప్స్ వీడియోలో ధరణిగా నాని ఆడిన ఊర మాస్‌ క్రికెట్ మెస్మరైజ్ చేసింది. లుంగీ కట్టుకొని బీడీ తాగుతూ క్రీజ్ లో బ్యాట్ పట్టుకొని బాల్ కోసం ఎదురుచూసిన ధరణి.. బాల్ ని సిక్సర్ గా మలిచి.. బ్యాట్ ని గాల్లో విసిరేసి.. నడుచుకుంటూరావడం.. గూస్  బంప్స్ తెప్పించింది. ఈ గ్లింప్స్ కు సంతోష్ నారాయణ్ సమకూర్చిన నేపధ్య సంగీతం మాస్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది.  

అలాగే నాని బర్త్ డే సందర్భంగా దసరా కు తెలుగు రాష్ట్రాల్లోని 39 కేంద్రాల్లో కౌంట్‌డౌన్ ఇన్‌స్టాలేషన్‌లు ఏర్పాటు చేశారు. ఇది ఇండియన్ సినిమాల్లోనే మొట్టమొదటి మాసీవ్ ఫీట్. సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై, విడుదల తేదీ వరకు ప్రతి రోజు థియేటర్లలో కటౌట్‌లను మారుస్తారు. తరువాత, కౌంట్‌డౌన్ ఇన్‌స్టాలేషన్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర నగరాల్లో ఏర్పాటు చేస్తారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుం

Dasara Released A Mass-appealing Poster:

 Wishing Natural Star Nani On His Birthday, The Makers Of Dasara Released A Mass-appealing Poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs