Advertisement
Google Ads BL

నాగ చైతన్య కస్టడీ పై క్రేజీ న్యూస్


అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. లీడ్ పెయిర్ - నాగ చైతన్య, కృతి శెట్టిపై  ఒక పాటను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం ఏడు విభిన్నమైన భారీ సెట్లు వేశారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ డివై సత్యనారాయణ కలిసి అద్భుతమైన సెట్స్‌ని రూపొందించారు. మాస్ట్రో ఇళయరాజా,  లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ నంబర్‌  బిగ్ స్క్రీన్‌పై విజువల్ ఫీస్ట్ గా వుండబోతుంది.

Advertisement
CJ Advs

సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. ఇప్పటివరకూ ఓ గ్లింప్స్ తో పాటు, నాగ చైతన్య, కృతి శెట్టి ఫస్ట్-లుక్ పోస్టర్‌ లని విడుదల చేశారు.

అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Custody Song Shoot In 7 Massive Sets:

Naga Chaitanya Bilingual Film Custody Song Shoot In 7 Massive Sets
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs