Advertisement
Google Ads BL

దలపతి 67 లో KGF విలన్


దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న ప్రాజెక్ట్  నిన్న అధికారికంగా అనౌన్స్ చేశారు. మాస్టర్, వారసుడు వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మూడవసారి విజయ్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్  పెట్టారు. మాస్టర్ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Advertisement
CJ Advs

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేరారు. ఈ చిత్రంలో భాగం అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. దలపతి67 వన్ లైనర్ విన్నప్పుడే ఈ చిత్రంలో భాగం అవుతానని తెలుసు.  ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా థ్రిల్‌గా వుంది అన్నారు సంజయ్ దత్

ఈ సినిమాలో ప్రియా ఆనంద్ కూడా భాగం కానుంది. దలపతి67లో భాగమైనందుకు థ్రిల్‌గా ఉంది. ఇటువంటి అద్భుతమైన తారాగణం, టీంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను! అన్నారు ప్రియా ఆనంద్.

కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతోచార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. దలపతి 67 కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు.

Sanjay Dutt, Priya Anand On Board Thalapathy67:

Sanjay Dutt, Priya Anand On Board For Vijay Thalapathy67
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs