Advertisement
Google Ads BL

చిరు గురించి పవన్‌ని ప్రశ్నించిన బాలయ్య


మీ అన్నయ్య చిరంజీవి నుండి నేర్చుకున్నవి ఏంటి, వద్దనుకున్నవి ఎంటి అని పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ గా అడిగేశాడు బాలయ్య. అన్ స్టాపబుల్ షో లో కొత్త ఎపిసోడ్ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన విషయం బాలయ్య తనదైన స్టైల్ లో పవన్ మీద ప్రశ్నాస్త్రాలు సంధించిన విషయం గురించి వింటూనే ఉన్నాం. ఆ ఎపిసోడ్ ఎప్పుడు అనేది ఆహా వారు ఊరించి ఊరించి కానీ చెప్పేలా లేరు కానీ షో కి సంబందించిన ప్రోమో విడుదల చేశారు. బాలయ్య, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనబడడం నుండి ఇద్దరు హీరోల అభిమానులకి ఫీస్ట్ లా ఉండబోతోందని తెలుస్తోంది.

Advertisement
CJ Advs

బాలా అని పిలవమని బాలకృష్ణ అడిగితే ఓడిపోవడానికి కూడా ఒప్పుకుంటాను కానీ అలా మాత్రం పిలవను అని పవన్ అనడం ముచ్చటగా ఉంది. ఇక బాలకృష్ణ తన ట్రేడ్ మార్క్ క్వశ్చన్స్ తో షో లో వేడి పుట్టించారు. ఈ మధ్య రాజకీయ స్పీచ్ లలో వాడి వేడి పెంచినట్లున్నారు అని బాలయ్య అడిగిన ప్రశ్నకి తన శైలిలో చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను అని పవన్ గుంభనంగా సమాధానం ఇచ్చారు.  చిరంజీవి నుండి తీసుకొని విషయాలేంటనే ప్రశ్న నుండి, ఇంత మంది అభిమానించే మీకు అవి ఓట్ల రూపంలో ఎందుకు మారలేదు అనే ప్రశ్నలతో షో మీద ఆసక్తిని ఆకాశమెత్తుకి తీసుకెళ్లారు. 

ఇది కేవలం గ్లింప్స్ మాత్రమే, ఇలాంటి వాడి ప్రశ్నలు, వాటికి పవన్ ఇచ్చే వేడి సమాధానాలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అన్ స్టాపబుల్ గా చర్చలు, డిబేట్ లు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ ఆహా లో త్వరలో ప్రసారం కానుంది.

NBK questioned PSPK about Chiru:

PSPK in NBK Unstoppable Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs