Advertisement
Google Ads BL

దసరా షూటింగ్ పూర్తి చేసిన నాని


నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదలైన ధూమ్ ధామ్ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నాని మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. గుబురుగా గెడ్డం పెంచి, లాంగ్ హెయిర్ లో కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో తన లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది.

Advertisement
CJ Advs

తాజాగా కీర్తి సురేష్ దసరా షూటింగ్ పూర్తయ్యింది అంటూ నాని కొత్త మేకోవర్ లుక్ ని షేర్ చేసింది. గెడ్డం తీసేసి.. చాలా నీట్ గా షేవ్ చేసి నాని కొత్తగా కనిపిస్తున్నాడు. కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ లుక్ నుండి మోడరన్ లుక్ లోకి మారిపోయింది.

ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. 

Dasara Shooting Wrapped Up:

Nani - Srikanth Odela Dasara Shooting Wrapped Up
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs