Advertisement
Google Ads BL

అమిగోస్ టీజర్ లో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ ట్రీట్


నందమూరి కళ్యాణ్ రామ్ కు విభిన్న కథాంశాలతో ఉన్న చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటాడనే ఇమేజ్ ఉంది. అందుకే సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాల పట్ల ఆడియెన్స్ లో ఆసక్తి ఏర్పడుతుంది. ఆ కోవ లోనే ఇటీవల విడుదలైన బింబిసార బ్లాక్ బస్టర్ విజయం సాధించి కళ్యాణ్ రామ్ కి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చింది. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమాకి అమిగోస్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఒకే రూపంలో ఉన్న ముగ్గురు కళ్యాణ్ రామ్ ల పోస్టర్లు ప్రేక్షకులను అట్రాక్ట్ చేశాయి. 

Advertisement
CJ Advs

ఈ రోజు అమిగోస్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నాడనే విషయాన్ని రివిల్ చేశారు. టీజర్ లో కొల్ కత్త కు చెందిన మైకేల్ గా ఇంట్రడ్యూస్ అయిన కళ్యాణ్ రామ్ తనలానే ఉండే సిద్ధార్థ, మంజునాథ్ అనే మరో ఇద్దరు వ్యక్తులను కలుస్తాడు. ఒకరికొకరు సంబంధం లేకపోయినా ఒకే రూపంతో ఉండేవారిని డాపెల్ గ్యాంగర్స్ అంటారు అని కాన్సెప్ట్ తో అమిగోస్ తరకెక్కింది. కానీ అలా ఒకేలా ఉండే వ్యక్తులు ఒకరినొకరు కలిసినప్పుడు అందులో ఒకరు చనిపోతారు అని ఇంట్రెస్టింగ్  ప్లాట్ పాయింట్ తో కథ సాగుతుంది. టీజర్ లో కూడా కళ్యాణ్ రామ్ చెప్పే, "మన ముగ్గురం కలవడం అద్భుతం విడిపోవడం అవసరం " అనే డైలాగ్, చివర్లో ఒక కళ్యాణ్ రామ్ మరో కళ్యాణ్ రామ్ నీ వేటాడటం లాంటి అంశాలు చూసినప్పుడు ఇందులో ఒకరు బ్రతికి ఉండాలంటే తనని పోలిన మిగతావారు చనిపోవాలనే కాన్సెప్ట్ ప్రధానంగా ఉండేలా కనిపిస్తుంది.

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో పాటు స్టైలిష్ యాక్షన్, క్వాలిటీ విజువల్స్ తో ఒక స్లిక్ యాక్షన్ థ్రిల్లర్ గా అమిగోస్ ని తెరకెక్కించారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన అమిగోస్ ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆషికా రంగనాథ్ కథానాయకగా నటించిన ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం అందించారు.

Kalyan Ram triple treat in Amigos teaser:

Huge response to Kalyan Ram Amigos teaser triple treat
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs