Advertisement

అడ్డంకులు అధిగమించిన వాల్తేరు వీరయ్య


మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్లు ఊపందుకున్నాయి.  ఈ రోజు విడుదలైన ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. చిరంజీవి మార్కు ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్ తో కంప్లీట్ ప్యాకేజ్ లా కట్ చేసిన  ట్రైలర్ వాల్తేరు వీరయ్య లో వింటేజ్ మెగాస్టార్ ను చూడబోతున్నాం అన్న నమ్మకాన్ని కలిగించింది. ఈ విషయంలో అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రేపు వైజాగ్ లో జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ మీదే ఉంది. 

Advertisement

జనవరి 8న వైజాగ్ ఆర్కే బీచ్ లో అభిమానుల నడుమ గ్రాండ్ గా వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని టీం ఎప్పుడో ప్రకటించారు. కానీ పోలీసుల పర్మిషన్ రాలేదని ఆర్కే బీచ్ లో అప్పటికే చేసుకున్న ఏర్పాట్లను ఆపేసారు. ట్రాఫిక్, సెక్యూరిటీ సమస్యలతో పర్మిషన్లు ఇవ్వలేమని, ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఈవెంట్ ని జరుపుకోమని పోలీసులు చెప్పడంతో నిర్వాహకులు  వేదికను ఏయూ గ్రౌండ్స్ కు మార్చారు. అక్కడ ఏర్పాట్లు మొదలు పెట్టగానే మళ్లీ పోలీసులు ముందే అనుకున్న ఆర్కే బీచ్ లోనే ఈవెంట్ ని జరుపుకోమని పర్మిషన్ ఇవ్వడంతో ఆర్కే బీచ్ లో వేదిక ఏర్పాట్లు ప్రారంభించారు.  అవగాహన లోపమో లేక మరేదైనా కారణమో కానీ పోలీసులు మళ్లీ ఆర్కే బీచ్ లో ఈవెంట్ జరపడం కుదరదని చెప్పారు. దీంతో అసలు వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా జరగదా అనే కన్ఫ్యూజన్లో అభిమానులు నిర్వాహకులు ఉండిపోయారు. మొత్తానికి స్థానిక అధికారులతో, పోలీసులతో జరిపిన చర్చల తర్వాత నిర్వాహకులకు ఏయూ ప్రాంగణంలోనే వేదికను జరుపుకోమని పర్మిషన్ ఇచ్చారు. 

ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తూ మైత్రి మేకర్స్ వారు ఏయు ప్రాంగణంలోనే వాల్తేరు వీరయ్య వేడుకను జరపబోతున్నట్టు, అందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, వైజాగ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈ సమస్యకు తెరపడినట్లు అయింది. నిన్న ఒంగోలులో జరిగిన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చివరి నిమిషం వరకు పర్మిషన్లు ఇవ్వకుండా టెన్షన్ పెట్టారు. వాల్తేరు విరయ్యకు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో రేపు వైజాగ్ లో వేడుకను ఘనంగా జరుపుకోవడానికి అభిమానులంతా ఉత్సాహంతో ఉన్నారు. 

మాస్ మహారాజ్ రవితేజ ఒక పవర్ఫుల్ పాత్రలో, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రానికి బాబీ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Obstacles removed for Waltheru Veeraya:

Waltair Veerayya overcomes obstacles for the pre-release event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement