Advertisement
Google Ads BL

బాలయ్య ఎనర్జీ, డెడికేషన్ కావాలి: వీరసింహారెడ్డి విలన్


గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వీరసింహారెడ్డి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే వీరసింహారెడ్డి ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని  జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా అలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో వీరసింహారెడ్డి లో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Advertisement
CJ Advs

వీరసింహారెడ్డితో మీ ప్రయాణం ఎలా మొదలైయింది?

దర్శకుడు గోపీచంద్ గారు ఇందులో నా పాత్ర గురించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. వీరసింహారెడ్డ కథలో విలన్ పాత్ర ఒక పిల్లర్ లా వుంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. ఇంత మంచి పాత్రలో బాలకృష్ణ గారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం.

ఈ పాత్ర కోసం మిమ్మల్ని సంప్రదించినపుడు మిమ్మల్నే ఎందుకు ఎంచుకుంటున్నారని దర్శకుడిని అడిగారా ?

అడిగాను. గోపిచంద్ గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన నా వర్క్ ని చూశారు. ఈ పాత్రకు నేను అయితే సరిపోతానని ఆయనకి అనిపించింది. ఇది లక్, గుడ్ టైం.

ఇందులో మీ లుక్ ఎలా వుంటుంది ?

చాలా మొరటుగా వుంటుంది. స్క్రీన్ పై చాలా మార్పు కనిపిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు ముస‌లిమ‌డుగు ప్రతాప్ రెడ్డి.

బాలకృష్ణ గారితో మీ కెమిస్ట్రీ ఎలా వుంటుంది ?

బాలకృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటింది ఆయనతో కలసినటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్ లో చూసినప్పుడు నన్నునేను నమ్మలేకపోయాను.

బాలకృష్ణ గారి సినిమాల్లో ఫైట్స్ పవర్ ఫుల్ గా వుంటాయి. మరి వీరసింహా రెడ్డి లో ఎంత పవర్ ఫుల్ గా వుంటాయి?

చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. వేరే ఎనర్జీ వుంటుంది. ప్రేక్షకులు ఆ ఎనర్జీని థియేటర్ లో ఫీలౌతారు. ఇందులో బాలకృష్ణ గారితో కలసి పని చేయడం జీవితంలో మర్చిపోలేను. ఆయన ఎనర్జీ, పని పట్ల అంకితభావం గొప్పగా వుంటుంది. అలాంటి ఎనర్జీ, డెడికేషన్ మాకూ కావాలి. బాలకృష్ణ గారిని ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చూస్తున్నపుడు దేవుడు లాంటి మనిషి అనిపించింది.

వీర సింహారెడ్డి ఎలా వుండబోతుంది ?

వీరసింహా రెడ్డి..అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ.

వీరసింహా రెడ్డి సక్సెస్ తర్వాత.. విలన్ గా పాత్రలని కొనసాగిస్తారా ?

మంచి పాత్రలు వస్తే విలన్ గా చేయడానికి సిద్ధమే. ఒక నటుడిగా అన్ని పాత్రలు చేయాలని వుంటుంది.

మీరు దర్శకుడు కూడా కదా.. నటనలో దర్శకత్వ నైపుణ్యత ఎంతవరకూ ఉపయోగపడుతుంది ?

నటన, దర్శకత్వం  రెండు వేరు వేరు. దర్శకుడిగా నటుల నుండి యాక్టింగ్ రాబట్టుకోవాలి. నటుడిగా వున్నపుడు నా పని నటించడమే. నటుడిగా చేస్తున్నపుడు నా ద్రుష్టి అంతా కేవలం నటనపైనే వుంటుంది. దర్శకుడు నా నుండి ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ వుంటుంది.

మీకు తెలుగులో ఇష్టమైన హీరోలు ?

ఒకరని చెప్పలేను. అందరూ ఇష్టమే. ఎవరి ప్రత్యేకతలు వారికి వున్నాయి.

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?

భీమా అనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది.  తెలుగులో కూడా కొందరు సంప్రదించారు. పాత్ర బలంగా వుంటే తప్పకుండా చేస్తాను.

Duniya Vijay Interview:

Duniya Vijay Interview about Veera Simha Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs