Advertisement

వైష్ణవ్ తేజ్ జోడిగా శ్రీలీల


పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో రూపు దిద్దు కుంటున్న  చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడు గా  ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. కథానాయికగా శ్రీ లీల నటిస్తున్న ఈ చిత్రాన్ని

Advertisement

నిర్మాతలు ఎస్. నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. 

ఆంగ్ల సంవత్సరాది శుభ వేళ ఈ చిత్రానికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. 29 ఏప్రిల్, 2023 న చిత్రం విడుదల అన్నది ఈ ప్రచార చిత్రం లో గమనించ వచ్చు. తీగల కంచె ఆవల అస్పష్టంగా కనిపిస్తూ కథానాయకుడు నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న  వైనం, ఆసక్తిని రేకెత్తిస్తూ, ఆకట్టుకుంటోంది ఈ విడుదల తేదీ ప్రచార చిత్రం.

తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. ఈ విషయాన్ని గతంలో 

పౌరుషా నికి ప్రతీకగా విడుదల అయిన ప్రచార చిత్రం నిరూపించింది. అంతేకాదు భారీస్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది.

వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం. పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక,నిర్మాతలు. 

ఇప్పటికే చిత్రం చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి  సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 

Vaisshnav Tej to romance Sreeleela :

Panja Vaisshnav Tej, Sreeleela mass entertainer Fortune Four Cinemas, to release on April 29
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement