Advertisement
Google Ads BL

చిరు-రవితేజ: పూనకాలు లోడింగ్ వచ్చేసింది


పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య లోని నాల్గవ పాటను చూడండి.

Advertisement
CJ Advs

ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పూనకాలు లోడింగ్ పాట ని విడుదల చేశారు మేకర్స్.  టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్‌లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ పాడారు. అలాగే  మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్..  పూనకాలు లోడింగ్ అనడం పూనకాలని రెట్టింపు చేసింది.

చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది. జాతర సెటప్, భారీ జనసమూహం ఈ మాస్ నంబర్‌ అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. చిరంజీవి, రవితేజల బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా ఉపయోగించాడు. చిరంజీవి మాస్‌ లుక్, గెటప్.. ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు లాంటి బ్లాక్‌బస్టర్స్ ని గుర్తుకుతెస్తుంది. మరోవైపు రవితేజ ట్రెండీగా కనిపిస్తున్నారు. మెగామాస్ మ్యాజిక్‌ని బిగ్ స్క్రీన్‌లపై చూడాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.

Waltair Veerayya Fourth Song Poonakaalu Loading is out now:

Chiranjeevi-Ravi Teja Waltair Veerayya Fourth Song Poonakaalu Loading is out now
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs