Advertisement
Google Ads BL

తల్లితండ్రులు కాబోతున్న డైరెక్టర్ అట్లీ-ప్రియ


కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు, తన వినూత్న టేకింగ్ తో కమర్షియల్ సినిమా ని మరో లెవెల్ కి తీసుకు వెళ్తూ అత్యంత విజయవంతమైన దర్శకుడిగా అందరి మెప్పు పొందాడు ఈ యువ డైరెక్టర్. 2019లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా బిగిల్ తో భారతదేశపు టాప్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు అట్లీ. ఇప్పుడు ఏకం గా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో తన బాలీవుడ్ అరంగేంట్రం చేయబోతున్నాడు

Advertisement
CJ Advs

కొన్నేళ్ల ప్రేమ తర్వాత అట్లీ 2014లో నటి కృష్ణ ప్రియను పెళ్లాడాడు. వారు కలిసి A ఫర్ ఆపిల్ ప్రొడక్షన్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించాలని ఆకాంక్షించారు మరియు వారి బ్యానర్ లో రెండు చిత్రాలను విజయవంతంగా నిర్మించారు. పెళ్లయి 8 ఏళ్లు అవుతోంది, అట్లీ & ప్రియా వారి జీవితంలో కొత్త అనుభూతిని పొందబోతున్నారు. సోషల్ మీడియా ద్వారా  వారు తల్లి తండ్రులు కాబోతున్న విషయాన్ని ప్రకటించారు దీనితో అభిమానులు మిత్రులు వారికి విషెస్ చెప్తూ తమ ప్రేమ ని తెలియజేస్తున్నారు

సంవత్సరాలుగా మీరు మాపై కురిపించిన ప్రేమ మరియు మద్దతుకు మేము కృతజ్ఞులమై ఉన్నాము, మీరు మా చిన్నారికి కూడా మీ ప్రేమను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. మీ అందరి ఆశీస్సులతో మా చిన్ని ఆనందాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చే ఈ ఉత్తేజకరమైన సాహసయాత్రను ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అంటూ ఈ పవర్ ఫుల్ కపుల్ ఈ వార్త ని సోషల్ మీడియా వేదిక గా పంచుకున్నారు

Atlee and his wife Priya Announces pregnancy:

Atlee and his wife Priya Announces pregnancy via social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs