Advertisement
Google Ads BL

వాల్తేరు వీరయ్య నుండి మెగాస్టార్ మాస్ లుక్


మెగాస్టార్ చిరంజీవి- రవితేజ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సంక్రాంతి 2023 ఫిలిం వాల్తేరు వీరయ్య. దర్శకుడు బాబీ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్యని,. చిరంజీవి- రవితేజ కాంబినేషన్ ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ప్రేక్షకులు ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు

Advertisement
CJ Advs

ఇటీవల విడుదలైన రవితేజ టీజర్ యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ తో ట్రెండింగ్ లో ఉంది. బాస్ పార్టీ పాట 25 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలను సంపాదించింది మరియు సోషల్ మీడియా ట్రెండింగ్ రీల్స్ లో నిలిచింది. ఇప్పుడు, మేకర్స్ అనూహ్య రీతి లో అవుట్ డోర్ ప్రమోషన్ లకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లకు స్టాండీలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

స్టాండీస్ పై  ఉండే పోస్టర్ ను విడుదల చేశారు. పోలీసు స్టేషన్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశం నుండి మెగాస్టార్ చిరంజీవి స్టిల్ ని విడుదల చేయడం జరిగింది . ఇందులో వీరయ్య గా మెగాస్టార్ చిరంజీవి ఒక చేతికి సంకెళ్లతో బ్యాగ్రౌండ్ లో తుపాకీలతో గంభీరంగా కూర్చుని కనిపిస్తున్నారు.

స్టైలిష్ ఇంకా భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేము సిద్ధంగా ఉన్నామని మెగాస్టార్ యొక్క స్వాగ్ వాగ్దానం చేస్తుంది. మసాలా జోడించి, థియేటర్ల లో ఈ ఎపిసోడ్ కి పూనకాలూ గ్యారెంటీ అనే విధం గా డైరెక్టర్ బాబీ ట్విట్టర్ లో ఈ స్టిల్ ని విడుదల చేశారు.

Theater Standees With Mega Star:

Theater Standees With Mega Star Chiranjeevi Massiest From Waltair Veerayya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs