మాస్ మహారాజా రవితేజ- త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ధమాకాతో డబుల్ ఇంపాక్ట్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో సినిమాలోని యాక్షన్ యాంగిల్ ఎక్కువగా చూపించారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు.
స్వామి (రవితేజ) నిరుద్యోగి. స్లమ్ లో నివసించే స్వామికి నెలకు కనీసం ఒక ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంతో కూడుకున్న పని. మరోవైపు ఆనంద్ చక్రవర్తి (మరో రవితేజ) ఒక మల్టీ మిలియనీర్. అతను ఒక నెలలో 1000 మందికి ఉపాధిని ఇవ్వగలడు. మరోవైపు పావని (శ్రీలీల) వారిద్దరితో ప్రేమలో ఉంటుంది. స్వామి, ఆనంద్‌లు దారులు వేరు. కానీ విధి వారిని ఒక కామన్ శత్రువుతో పోరాడటానికి ఒకచోట చేరుస్తుంది.
కథాంశం కమాండింగ్ గా వుంది. స్క్రీన్‌ప్లే రెసీ, ఎంటర్ టైనింగా వుంది. రవితేజ ఆనంద్‌గా క్లాస్‌గా కనిపించి స్వామిగా మాస్‌గా కనిపించారు. రెండు పాత్రలలోనూ ఒదిగిపోయినప్పటికీ మాస్ క్యారెక్టర్ మరింత ఆకర్షణీయంగా వుంది. శ్రీలీల తన ఛార్మ్ నెస్ తో ఆకట్టుకుంది. శ్రీలీలా, రవితేజ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అలరిస్తోంది. త్రినాథరావు నక్కిన ధమాకాని పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం ఫ్యాన్స్ కు థ్రిల్ చేస్తోంది.