Advertisement
Google Ads BL

కంటెంట్ బాగుంటే ఆడియన్స్ వస్తారు: సత్యదేవ్


మన  జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్ కి బాగా కనెక్ట్  అయ్యే  రొమాంటిక్ ఎంటర్టైనర్ మన ముందుకు వస్తుంది. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో  శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై యంగ్ & టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టరస్ తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా. నర్మిస్తున్నారు.కాల భైరవ అందించిన సంగీతం మనసును మైమరిచిపోయేలా చేస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  డిసెంబర్ 9న గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర హీరో సత్య దేవ్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. 

Advertisement
CJ Advs

నా అభిమాన నటుడు చిరంజీవి గారితో నటించడం అనేది చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. అయితే నేను అనుకున్న దానికంటే మంచి పేరు రావడం చాలా హ్యాపీ గా ఉంది. ఈ సంవత్సరంలో ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఐదవ సినిమా గుర్తుందా సీతాకాలం రావడం చాలా హ్యాపీ గా ఉంది 

ఇంతకుముందు ఎప్పుడు ఇలా 3 షేడ్స్ ఉన్న సినిమా  చెయ్యలేదు..నేను ముందు తమన్నా తో చేస్తాను అనులోలేదు,ఇందులో తమన్నా చేస్తుంది అనగానే తనతో చేయడానికి ముందు బయపడ్డా.. తరువాత  తను ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసి చెయ్యడానికి ఒప్పుకున్నందని తెలిసి చాలా హ్యాపీ గా అనిపించింది.తను ఇందులో నిది క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది  .

గుర్తుందా శీతాకాలం అనేది మంచి సినిమా ఈ వయసులో చేయలేకపోతే తర్వాత చేయలేం కాబట్టి కాలేజీ సీన్స్ ఉన్నాయని  తెలుసుకొని ఈ సినిమా చేశాను .మూడు షేడ్స్ ఉన్న ఈ సినిమాలో  రొమాన్స్ తో పాటు  ఇందులో కొత్తదనం కనిపిస్తుంది. కన్నడలో నేటివిటీ తో తీసిన సినిమా అయినా మన తెలుగు నేటివిటీ కి చేంజ్ చేయడం జరిగింది జరిగింది. ఈ సీతకాలంలో రిలీజ్ చేసే టైం రైట్ టైం అని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము.

ఇంతకుముందు ఇదే జోనర్ లో ప్రేమమ్, ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలు వచ్చినా ఇందులో కొత్తదనం కనిపిస్తుంది. కాబట్టి ఆ సినిమాలను ఆదరించి నట్లే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది.

స్కూల్, కాలేజ్, ఆతరువాత మిడిల్ ఏజ్  ఇలా ఇన్ని వేరేషన్స్ లలో  నటించే అవకాశం రావడం చాలా అరుదు. కాబట్టి ప్రేక్షకులకు ఒప్పించడానికి  ఈ క్యారెక్టర్స్ కొరకు చాలా హోమ్ వర్క్ చేశాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది.

ఏ సినిమా చేసినా మంచి హిట్ అవుతుంది అనుకొనే చేస్తాము. చేసిన తరువాత కథ బాగున్నా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోతె ఆ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, కొన్ని కథల మీదహోప్ లేకపోయినా సూపర్ హిట్ అవుతాయి. మేము  అన్ని సినిమాలకు ఒకటే హార్డ్ వర్కచేస్తాము.

ఈ మధ్య థియేటర్స్ కు జనాల రావడం లేదు అంటున్నారు కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు.ఈ మధ్య  వచ్చిన లవ్ టుడే సినిమాలో ఎవ్వరూ పెద్ద స్టార్స్ లేరు , ఎక్కడో విలేజ్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తీసిన  కాంతారా సూపర్ హిట్ అయ్యింది. కాబట్టి కంటెంట్ బాగుంటే మూవీ రిలీజ్ తరువాత రోజే అడియన్స్ మౌత్ టాక్  ద్వారా బావుంది అంటే  ఆడియన్స్ థియేటర్స్ కు కచ్చితంగా వస్తారు.

అలాగే లవ్ స్టోరీ తో వచ్చే సినిమాలు యూనివర్షల్ అవి ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు.ఈ మద్యే వచ్చిన  సీతారామం, లవ్ టుడే వంటి సినిమాలను ఆదరించినట్లే  ఇప్పుడు వస్తున్న మా గుర్తుందా సీతకాలం  సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

చిరంజీవి, నయన తార, ఛార్మి, తమన్నా వంటి సీనియర్స్ తో  వర్క్ చేస్తుంటే నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను. వారి దగ్గర  అంతా టైమ్ ప్రకారం జరిగిపోతుంది టైమ్ వేస్ట్ కాదు, షూటింగ్ కూడా స్పీడ్ గా జరిగిపోతుంది. 

నార్త్ ఇండియా స్టార్ అక్షయ్ కుమార్ తో  చేయడం చాలా హ్యాపీ గా ఉంది.తను కరెక్ట్ గా 6 అంటే 6 కు టైంకు సెట్ లో ఉంటారు. తనకంటే ముందు రావాలని నేను చూసినా నాకంటే ముందే తను ఉండే వారు. ఆయన ఎంతో  డెడికేషన్, వర్క్ లో నాకు చాలా నచ్చింది.

ఈ సినిమా తర్వాత  కృష్ణమ్మ,  ఫుల్ బాటిల్, తమిళ్,కన్నడ భాషల్లో  రూపొందే సినిమా 40% అయ్యింది ఇవి కాకుండా ఇంకా కొన్ని సినిమాలు లైనప్ లో ఉన్నాయి అని ముగించారు.

Sathya Dev Interview:

Sathya Dev Interview about Gurtunda Seethakalam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs