Advertisement
Google Ads BL

ధనుష్ సార్ నుంచి మాస్టారు... సాంగ్


సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో స్టార్ యాక్ట‌ర్‌ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సార్ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో  నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం సార్(తెలుగు) ‌వాతి,(తమిళం) నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా, మరోవైపు చిత్రం పాటల ప్రచార పర్వం వైపు అడుగు వేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే చిత్రానికి సంభందించిన తొలి గీతం ఈరోజు విడుదల అయింది. 

Advertisement
CJ Advs

మాస్టారు మాస్టారు

నా మనసును గెలిచారు 

అచ్చం నే కలగన్నట్టే

నా పక్కన నిలిచారు... అంటూ సాగే  ఈ గీతానికి తమిళంలో ధనుష్, తెలుగు లో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించటం విశేషం.  జి వి ప్రకాష్ స్వరాలు, శ్వేతామోహన్ స్వరం పోటీ పడ్డాయనిపిస్తింది. పాట చిత్రీకరణ కూడా అంతే. నాయిక, నాయికల భావోద్వేగాలు,కనిపించే దృశ్యాలు, వారి అభినయం వీక్షకుల మనసును హత్తుకుం టాయి. కళాశాల నేపధ్యంలో శేఖర్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిం చుకున్న ఈ గీతం చిత్ర కథానుసారం కథానాయకుడు ధనుష్ ప్రవర్తన, అతని మంచి మనస్తత్వం, గొప్పతనం గుర్తెరిగిన నాయిక సంయుక్త మీనన్ మనసు ప్రేమైక భావన కు గురైన సందర్భం. ఆ ఊహల్లో, అలాంటి నేపధ్యంలో వచ్చే గీతం ఇది. పాటానుసారం ధనుష్, సంయుక్త మీనన్, విద్యార్థులు కనిపిస్తారు. ఇది అచ్ఛ తెలుగు పాట, ఓ అందమైన పాట, మంచి పాట, ప్రయోజనం ఉన్న పాట, ఉపయోగం ఉన్న పాట, సున్నితమైన భావోద్వేగాలు కలిగిన పాట ఇది. పాట రాయటానికి కొంత కష్ట పడినప్పటికీ, దర్శకుడు వెంకీ గారు చెప్పిన పాట సందర్భం, ఆయన ఆలోచనలు అన్నీ చక్కని సాహిత్యం సమకూర్చటానికి నన్ను ముందుకు నడిపాయి. ఈ పాట కు ఇటు నేను, అటు తమిళంలో ధనుష్ సాహిత్యం అందించటం కొత్త అనుభూతి. భావం ఒక్కటే అయినా శైలి భిన్నంగా ఉంటుంది. జి వి ప్రకాష్ బాణీ ల్లో మరింతగా ఒదిగిన సాహిత్యం ఉన్న పాట ఇది. గాయని శ్వేతా మోహన్ గాత్రం పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తుంది. 

SIR Movie First Single Out Now:

Mastaaru Mastaaru First Single From SIR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs