Advertisement
Google Ads BL

35 ఏళ్ళ తర్వాత రేర్ కాంబో రిపీట్


35 సంవత్సరాల క్రితం మణిరత్నంతో పని చేసినపుడు ఎంత ఉత్సాహంగా వున్నానో ఇప్పుడు అంతే ఉత్సాహంగా వుంది. ఒకేరకమైన మనస్తత్వంతోవున్న వారితో కలసి పని చేయడం గొప్ప ఉత్తేజాన్నిస్తుంది. ఈ ఉత్సాహంలో రెహమాన్ కూడా తోడయ్యారు. మిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌ తో కలిసి ఈ వెంచర్‌ ని ప్రజంట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. అంటూ కమల్ హాసన్ మణిరత్నం తో సినిమాని అనౌన్స్ చేసారు.

Advertisement
CJ Advs

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్,  రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు. కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించనున్నారు. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుంది. 

దర్శకుడు, నిర్మాత మణిరత్నం మాట్లాడుతూ, కమల్ సర్‌ తో మళ్లీ కలిసి పని చేయడం సంతోషంగా, గౌరవం, ఉత్సాహంగా ఉంది. అన్నారు.

ఈ సందర్భంగా నటుడు ,నిర్మాత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, ఉలగనాయగన్  కమల్ హసన్ గారి 234 చిత్రాన్ని ప్రజంట్ చేయడం గొప్ప గౌరవం, ఒక అద్భుతమైన అవకాశం. కమల్ సర్, మణి సర్  ని అమితంగా ఆరాధిస్తాను. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు,

Kamal Haasan Next With Maniratnam :

Kamal Haasan Next With Maniratnam anounced 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs