Advertisement
Google Ads BL

యశోద కమర్షియల్ స్క్రిప్ట్: ఉన్ని ముకుందన్


సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా యశోద. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రమిది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్ మీడియాతో ముచ్చటించారు. 

Advertisement
CJ Advs

- హాయ్ ఉన్ని ముకుందన్ గారు... ఎలా ఉన్నారు?

ఉన్ని ముకుందన్ : హలో అండి. నేను బావున్నాను. సూపర్బ్. యశోద విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను. 

- తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 11న యశోద విడుదలవుతోంది. ఇంతకు ముందు మీరు తెలుగు సినిమాలు చేశారు. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ ఎగైన్!

తెలుగులో మూడు సినిమాలు చేశాను. ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ ప్లే చేశా. ఆ  సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు యశోదలో సమంతతో కలిసి నటించా. ఆమె చాలా టాలెంటెడ్ యాక్టర్. నటుడిగా నా విషయానికి వస్తే... కథ ఎలా ఉంది? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తాను. ఆ పాత్రలో నేను ఎంత చేయగలను? అనేది ఆలోచిస్తా. నటుడిగా కొత్తదనం చూపించడం కూడా ముఖ్యమే కదా! యశోద షూటింగ్ వెరీ వెరీ ఎంగేజింగ్ ప్రాసెస్. మంచి సినిమా తీశాం. ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను. 

- దర్శకులు హరి, హరీష్ కథ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?

వెంటనే ఓకే చెప్పేశా. అందులో మరో సందేహం లేదు. 

- యశోదలో మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న అంశం ఏమిటి? ట్రైలర్ చూస్తే మీరు డాక్టర్ రోల్ చేశారని తెలుస్తోంది

ప్రస్తుతానికి నా క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పలేను. ఎందుకనేది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. నేను వెంటనే ఓకే చెప్పడానికి కారణం కూడా కథే. నా రోల్ గురించి ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉండనివ్వండి. 

- సమంతతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

సమంత చాలా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. తన పాత్ర కోసం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యారు. ఫైట్స్ బాగా చేశారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ చేశారు.  సెట్‌లో ఇతర ఆర్టిస్టులతో చక్కగా మాట్లాడతారు. ఒక  సన్నివేశం చేసేటప్పుడు ఎలా చేస్తే బావుంటుందని ఐడియాస్ డిస్కస్ చేసుకున్నాం. మలయాళంలో వర్కింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నటుడిగా రిహార్సల్స్ ఇవ్వడానికి నేను కొంచెం ఆలోచిస్తా. మలయాళ సినిమా సెట్‌లో ఇతర ఆర్టిస్టులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని చూస్తా. ముందు ఏం చేస్తానో చెప్పను. డైరెక్ట్ కెమెరా ముందు చేసి చూపిస్తా. అప్పుడు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ నేచురల్‌గా ఉంటాయి.   

- తెలుగులో కూడా సేమ్ ఫాలో అవుతున్నారా?

అవును. మలయాళంలో అలా చేసినప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో... ఇక్కడ కూడా సేమ్! నేను ఎలా చేస్తానో తెలియనప్పుడు ఎదుటి ఆర్టిస్ట్ ఎక్స్‌ప్రెషన్స్ లైవ్లీగా ఉంటాయి. 

- ఇటీవల సమంత తనకు మైయోసిటిస్ ఉందని చెప్పారు. షూటింగ్ చేసేటప్పుడు మీకు తెలుసా?

షూటింగ్ చేసేటప్పుడు నాకు తెలియదు. సమంత చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. ఎప్పుడూ తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదు. సమంత పోస్ట్ చూసి శాడ్ గా ఫీలయ్యాను. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా ఆవిడ మైయోసిటిస్‌తో పోరాటం చేస్తారు. ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు.   

- ట్రైలర్‌కు అన్ని భాషల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మలయాళ ప్రేక్షకుల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తోంది?

మలయాళంలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క మలయాళం మాత్రమే కాదు... అన్ని భాషల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అందరినీ ఆకట్టుకునే కమర్షియల్ ప్యాకేజ్డ్ స్క్రిప్ట్ ఇది. థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. 

- తెలుగులో ఆదిత్య 369 వంటి గొప్ప సినిమా తీసిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. ఆయన నిర్మాణంలో యశోద చేయడం ఎలా ఉంది?

ఆయన చాలా హంబుల్ పర్సన్. వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఆయన గురించి చాలా తెలుసుకున్నాను. స్టోరీ లైన్, స్క్రిప్ట్‌లో ప్రతిదీ ఆయనకు తెలుసు. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏం కావాలన్నా ఇస్తారు. ఎప్పుడూ సినిమా బాగా రావాలని ఆశిస్తారు. దానికి ఏం చేయడానికి అయినా రెడీగా ఉంటారు. మా టీమ్, డైరెక్టర్స్ అంతా శ్రీదేవి మూవీస్ సంస్థకు కృతజ్ఞతతో ఉండాలి. యశోద ఫ్యూచరిస్టిక్ స్టోరీ ఐడియా. మన సొసైటీ ఎటు వెళుతుందనేది చూపిస్తున్నారు. త్వరలో అది రియాలిటీగా మారుతుంది.

- సరోగసీ నేపథ్యంలో సినిమా తీశారు. సరోగసీపై మీ అభిప్రాయం ఏమిటి?

వ్యక్తిగత పరమైన అంశం అది! చట్టప్రకారం సరోగసీని ఆశ్రయించినప్పుడు ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. సరోగసీ అనేది చెప్పడం సులభమే. కానీ, అదొక ఎమోషనల్ జర్నీ. ఈజీగా దానిపై కామెంట్ చేయకూడదు. సైంటిఫిక్‌గా చూస్తే... మిరాకిల్. పురాణాల్లో మనం అటువంటి వాటి గురించి విన్నాం. 

- ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు?

మలయాళంలో రెండు మూడు చేస్తున్నాను. మాలికాపురం సినిమా పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో చేస్తున్నాం. తెలుగులో కూడా దానిని విడుదల చేస్తున్నాం. 

Unni Mukundan Interview:

Unni Mukundan Interview about Yashoda movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs