Advertisement
Google Ads BL

వీర సింహా రెడ్డిలో నాది క్రేజీ క్యారెక్టర్ : వరలక్ష్మీ


సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా యశోద. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీ కోసం... 

Advertisement
CJ Advs

యశోద కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి?

ఇటువంటి క్యారెక్టర్లను ఎలా రాశారు? ఈ కథను ఎలా ఆలోచించారు? అని  ఆశ్చర్యపోతూ అడిగాను. మీరు ట్రైలర్ చూస్తే... నా క్యారెక్టర్ చాలా కామ్ గా ఉంటుంది. కథ ముందు సాగేటప్పుడు క్యారెక్టర్ గురించి మరింత రివీల్ అవుతుంది. గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్... మా కథలు ఆసక్తిగా ఉంటాయి.  

ఈ స్క్రిప్ట్ వరకు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి?

పెద్ద ఛాలెంజెస్ ఏమీ లేవు. సమంతలా నేను ఫైట్స్ ఏమీ చేయలేదు. నటిగా మంచి క్యారెక్టర్ చేశాను. ఒక డిఫరెంట్ రోల్ చేసేటప్పుడు నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటా. ఆ విధంగా ఛాలెంజింగ్ అనిపించింది. 

మీరు యశోద చేయడానికి, ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?

సమంతతో పాటు నా క్యారెక్టర్ కూడా ప్యారలల్ గా ఉంటుంది. సినిమాలో లీడ్ రోల్ సమంత చేశారు. ఆమెకు ఒకరు అవసరం అవుతారు. అప్పుడు నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. రెండు కథలు జరుగుతాయి. ఆ రెండూ ఎలా కలిశాయి? అనేది సినిమా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. నాది సెకండ్ లీడ్ అని చెప్పవచ్చు. ఇంత కంటే ఎక్కువ చెబితే స్టోరీ రివీల్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడులు చూపించారు. 

మీది డాక్టర్ క్యారెక్టరా?

డాక్టర్ కాదు అండి. ట్రైలర్ లో చూపించిన సరోగసీ ఫెసిలిటీ సెంటర్ హెడ్. ఆమె చాలా రిచ్. డబ్బులు అంటే ఇష్టం. నిజ జీవితంలో నా డ్రసింగ్ స్టైల్, ఇతర అంశాలకు పూర్తి విరుద్ధంగా ఆ పాత్ర ఉంటుంది. తనను తాను బాగా ప్రేమించే పాత్ర. 

దర్శకులు హరి, హరీష్ గురించి చెప్పండి!

దర్శకులు ఇద్దరూ చాలా కామ్. నేను పని చేసిన దర్శకుల్లో అంత కామ్ గా ఎవరినీ చూడలేదు. వాళ్ళిద్దరూ అరవడం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళకు ఏం కావాలో బాగా తెలుసు. ఒక్కో క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశారు. మహిళల పాత్రలను చాలా మంది రిలేట్ చేసుకుంటారు. ఆ విధంగా క్యారెక్టర్లు డిజైన్ చేశారు. 

టెక్నికల్ పరంగా సినిమా ఎలా ఉండబోతోంది?

సినిమాటోగ్రాఫర్ సుకుమార్ గారు అద్భుతంగా షూట్ చేశారు. సినిమాలో సంగీతానిది కీలక పాత్ర. మణిశర్మ గారు మంచి సంగీతం అందిస్తున్నారు. మీరు పెట్టే టికెట్ రేటుకు వేల్యూ ఉంటుంది. సినిమాలో అంత మంచి కంటెంట్ ఉంది. క్వాలిటీ విజువల్స్ ఉంటాయి. మా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు ఎంతో ఖర్చుపెట్టి సెట్స్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కనబడుతోంది. 

సరోగసీ గురించి ఇండియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కథ ఏ విధంగా ఉండబోతోంది?

సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ, సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారని అనిపిస్తుంది.

యశోదలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏది?

నా క్యారెక్టర్‌లో డెప్త్ నాకు బాగా నచ్చింది. యశోద క్యారెక్టర్ కూడా వెరీ స్ట్రాంగ్ రోల్. సమంత చాలా కష్టపడ్డారు. క్యారెక్టర్స్ కంటే కథ నా ఫేవరెట్. నాకు, రావు రమేశ్ గారికి మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి. అలాగే... ఉన్ని ముకుందన్, నాకు మధ్య సీన్స్ ఉన్నాయి. అన్నీ బావున్నాయి. యశోదలో కథే హీరో. మేమంతా ఆ కథలో పాత్రధారులు మాత్రమే. 

సమంతతో ఫస్ట్ టైమ్ సినిమా చేశారు. ఆమెతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

నాకు సమంత పది పన్నెండు ఏళ్ల క్రితమే తెలుసు. మాకు చెన్నైలో పరిచయం అయ్యింది. సినిమాలో తనకు సీరియస్ సీన్స్ ఉన్నాయి. నేను ఏమో షూటింగ్ గ్యాప్ వస్తే జోక్స్ వేసేదాన్ని. తను నవ్వేది. షాట్ ముందే ఎందుకు ఇటువంటి జోక్స్ వేస్తావ్? అనేది. తనతో నటించడం సరదాగా ఉంటుంది. తను స్ట్రాంగ్ విమెన్. పాత్రలో జీవించింది. పవర్ ఫుల్ రోల్ బాగా చేసింది.

తెలుగులో మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు ప్రేక్షకుల గురించి...

క్రాక్ లో జయమ్మ తర్వాత నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. రచయితలు నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారు. ఇప్పుడు నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. బయటకు వెళ్ళడానికి ఖాళీ లేదు. తమిళ సినిమాలు చేయడానికి డేట్స్ లేవు. నాకు స్టీరియో టైప్ రోల్స్ రావడం లేదు. అది సంతోషంగా ఉంది. 

ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు?

తెలుగులో శబరి చేస్తున్నా. అందులో నాది లీడ్ రోల్. వీర సింహా రెడ్డిలో నాది క్రేజీ క్యారెక్టర్. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి.

Varalakshmi Sarathkumar Interview:

<span>Varalakshmi Sarathkumar interview about Yashoda</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs