Advertisement
Google Ads BL

దీపావళి ప్రత్యేకం.. సితార నృత్యం


ప్రజలంతా దీపావళి పండుగని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సినీ ప్రేమికులకు దీపావళి పండగ అటు టపాకాయల వెలుగులనే కాకుండా, ఇటు తమ అభిమాన నటుల రాబోయే చిత్రాలనుండి అద్భుతమైన ఆసక్తికరమైన వార్తలు రాసాగాయి. ఇదే నేపథ్యంలో మహేష్ బాబు కూతురు సితార పండగపూట తన నాట్య విన్యాసాలతో ఆకట్టుకుంది. మహేష్ బాబు అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ తన కూతురి నర్తించిన వీడియోని షేర్ చేసాడు.

సితార కూడా తన వీడియోని విడుదల చేస్తూ "నా నాట్య గురువు మహతి భిక్షు  అక్కా గారి సహకారంతో ఈ డ్యాన్స్ రిసైటల్‌ని అందించడం ఆనందంగా ఉంది దీపావళి సందర్భంగా, మేము దివ్య కాంతిని జరుపుకుంటాము.. తన దయ మరియు దాతృత్వంతో విశ్వాన్ని పోషించే లక్ష్మీ దేవి యొక్క గొప్పతనం మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. : @అరుణాభిక్షు గారూ""

సితారలోని అంతర్లీన ప్రతిభను సినీ ప్రేమికులు కొనియాడుతున్నారు. ఆమె ఇటీవల తన తండ్రి మహేష్ బాబు యొక్క సర్కారు వారి పాటలో ఎవ్రీ పెన్నీ పాటకు డ్యాన్స్ చేస్తూ తన డ్యాన్స్ టాలెంట్‌ని చూపించింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు తన రాబోయే ఎంటర్‌టైనర్ SSMB28 రెండవ షెడ్యూల్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. ఇది కాకుండా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్నాడు.

Advertisement
CJ Advs

Mahesh Babu Daughter Sitara Classical Dance:

Mahesh Babu Daughter Sitara Traditional Dance 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs