ప్రస్తుత జీవితంలో మనందరికీ సోషల్ మీడియా అనేది తప్పనిసరి అయ్యింది. ఎక్కడో చిన్న పల్లెటూరు లో ఉన్న వారు సైతం ఒక వైపు చదువుకుంటూ, మరో వైపు సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ ను బ్యాన్ చేసింది. ఆ తరువాత యువత తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి తెలియజేయడానికి మరో ఆల్టర్నేట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. INC సంస్థ వారు ME 4 Tic Tic యాప్ ను హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖులు మరియు యువత సమక్షంలో ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. టిక్ టాక్ లేక ఇబ్బంది పడుతున్న ట్యాలెంటెడ్ యూత్ కు ME 4 టిక్ టిక్ యాప్ ఒక యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. ఈ ME 4 టిక్ టిక్ యాప్ కు రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్. ఇండియా విభాగానికి డి.సతీష్ రెడ్డి గారు CEO గా వ్యవహరిస్తున్నారు.
ఈ యాప్ లాంచ్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి, సినీ జోష్ వెబ్ సైట్ సీఈఓ రాంబాబు పర్వతనేని, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, పీ ఆర్ ఓ ఆర్.డి.ఎస్ ప్రకాష్ ల చేతుల మీదుగా ఘనంగా లాంచ్ చేయడం జరిగింది.
ME 4 Tic Tic యాప్ ఇండియా CEO, డి.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యాప్ అయిన ME 4 Tic Tic ను మీడియా సమక్షంలో ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. INC కంపెనీ వారి ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న చైనా యాప్ లో సెక్యూరిటీ ప్రాబ్లెమ్ ఉన్నందున వాటిని కేంద్రం బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇండియా లో మేము విడుదల చేసిన ME 4 టిక్ టిక్ యాప్ అనుమతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మరువలేనిది. వారందరికీ మా ధన్యవాదాలు. అలాగే తెలంగాణ ఐ టి మినిస్టర్ కె. టి. ఆర్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. వారికి నా ధన్యవాదాలు. మేము విడుదల చేసిన ME 4 టిక్ టిక్ యాప్ ఫుల్ సెక్యూర్డ్ గా ఉంటుంది. ఇందులో ఉండే డేటా చాలా సేఫ్. ఈ రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. INC వారి ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంది. ఇది మన భారత ఐటీ యువత రూపొందించిన హైలీ సెక్యూర్డ్ యాప్. మేము ఆమెజాన్ తో టై అప్ అయ్యాం. వారి సర్వర్ల ద్వారా ఇది పనిచేస్తుంది. కాబట్టి అమెజాన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఈ యాప్ ఉంటుంది. టిక్ టాక్ ను మరిపించేలా మేము విడుదల చేసిన ME 4 టిక్ టిక్ యాప్ లో అన్ని రకాల కంటెంట్ తో అందరినీ అలరిస్తుంది. చాలా మంది ఈ యాప్ ఫారిన్ క్రియేట్ అయ్యింది అనుకుంటున్నారు. కానీ ఇది పూర్తిగా ఇండియాలో యువతీ, యువకుల తెలివి తేటలతో రూపొందించిన యాప్. ఒక ఇండియన్ అయిన నేను ఇండియాలో ఈ యాప్ లాంచ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
VIP ప్రైమ్ సంస్థ ఇండియా లో సినిమాలు కొనటం ప్రారంభించింది. -సీఈఓ డి. సతీష్ రెడ్డి
రియోజాన్ నుండి ఈ ఒక్క యాప్ మాత్రమే కాకుండా ఇదే సంస్థ నుండి ప్రేక్షకులను అలరించడానికి VIP ప్రైమ్ అను ఓటిటి ప్లాట్ ఫామ్ కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. VIP ప్రైమ్ సంస్థ ఇండియా లో సినిమాలు కొనటం ప్రారంభించింది. ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలనే పట్టుదలతో ఈ రోజు దానికి సంబంధించిన లోగోను విడుదల చేయడం జరిగింది. ఈ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో ఇండియన్ సినిమాల బిజినెస్ చేయడం ప్రారంభించాము. అలాగే మన తెలుగు న్యూస్ అందించడానికి ఇండియాలో BIJ ఓటీటీ న్యూస్ ను అందుబాటులోకి తెస్తున్నాము. ఈ న్యూస్ 150 దేశాల్లో చూసేలా ఈ యాప్ ను డిజైన్ చేశాము. మేము అమెజాన్ తో బిజినెస్ పార్టనర్ గా ఉన్నందున, మేము అందించే ఈ కంటెంట్ అమెజాన్ సర్వర్ ద్వారా ప్రసారమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాము అన్నారు.
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వినాయకరావు మాట్లాడుతూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇదివరకు మనలో ఉన్న ట్యాలెంట్ ను ఏ రూపంలో చూయించాలో తెలియక చాలా కష్టపడాల్సి వచ్చేది.అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తరువాత టిక్ టాక్ వలన చాలా మంది సినిమా స్టార్స్ కంటే ఎక్కువ పాపులారిటీ సాధించారు. ప్రస్తుతం అలాంటివి లేని టైమ్ లో ఇప్పుడు రియోజాన్ వారు ME 4 టిక్ టిక్ ను తీసుకురావడం శుభపరిణామం. ఈ యాప్ ద్వారా కూడా ఎంతో మంది యువతీ, యువకులు స్టార్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఇదివరకు సినిమాలో ఏ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారని ఫోటో షూట్ చూసి సెలెక్ట్ చేసేవారు. అయితే సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది దర్శక, నిర్మాతలకు ఈజీ అయ్యింది. అనూహ్యంగా టిక్ టాక్ బంద్ అయిన తరువాత ME4 టిక్ టిక్ పేరుతో వస్తున్న ఈ యాప్ పెద్ద సక్సెస్ అవ్వాలి అన్నారు.
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ సినీ జోష్ సీఈఓ రాంబాబు పర్వతనేని మాట్లాడుతూ.. టిక్ టాక్ యాప్ ను ఇండియాలో బ్యాన్ చేసిన తరువాత ME4టిక్ టిక్ యాప్ లైసెన్స్ పొందడమే గొప్ప అచీవ్ మెంట్ గా భావించాలి. అక్కడే రియోజాన్ సంస్థ విజయం సాధించింది అని చెప్పవచ్చు. ఈ యాప్ ఇండియా లోని మన తెలుగు రాష్ట్రం నుండి 150 దేశాలకు వెళ్లడం గర్వకారణం. అందుకు టీం అందరికీ కంగ్రాట్స్ అన్నారు.
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఆర్.డి.ఎస్.ప్రకాష్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు ఉన్న యూత్ అంతా వారి ట్యాలెంట్ ను చైనా యాప్ లో ప్రూవ్ చేసుకొనే వారు.అయితే అది బ్యాన్ అయిన తరువాత యువత తమ ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో ఇండియన్ టెక్నాలజీ తో భారత యువత రూపొందించిన ME4 టిక్ టిక్ రావడం హర్షించదగ్గ విషయం. ప్రస్తుతం తెలుగు సినిమా ఫీచర్ ఫిలిమ్స్ మాత్రమే కాక.. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లలో వస్తున్నాయి. కనుక ఇప్పుడు వచ్చే ME 4 టిక్ టిక్ యాప్ ద్వారా టాలెంట్ ఉన్న వారిని గుర్తించడం ఇండస్ట్రీ కి చాలా ఈజీ అవుతుంది. వెంటనే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వారి ట్యాలెంట్ ను నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర బృందం తో పాటు ఈ యాప్ ను ఆశీర్వదించటానికి వచ్చిన శ్రేయోభిలాషులు, అతిధులు దర్శకుడు జి. వి. కృష్ణన్, నిర్మాతలు శివ కంఠమనేని, శాంతన్ రెడ్డి, Drసింధు రెడ్డి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ జె. ప్రభాకర్ రెడ్డి, హీరో నాగ వర్మ, హీరోయిన్ ప్రియ పాల్ ఇంకా పలువురు సాంకేతిక నిపుణులు, యువత.. పాల్గొని రియోజాన్ సంస్థ నుంచి వస్తున్న ఈ యాప్ హైదరాబాద్ నుంచి 150 దేశాలకు చేరడం చాలా హ్యాపీ గా వుందని రియోజాన్ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు.
Advertisement
CJ Advs
ME 4 Tic Tic app launch