Advertisement
Google Ads BL

ఊర్వశితో రామ్ - ఊపేసే ఐటెం సాంగ్


ఎనర్జిటిక్  హీరో రామ్ ఈ మధ్య బాక్స్ ఆఫిస్ వద్ద ఎదురు దెబ్బలు తింటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ లో తన ఇమేజ్ ని పెంచుకున్న రామ్, ఆ తర్వాత తారాపధంలో దూసుకుపోవడానికి చేయని ప్రయత్నం లేదు. అయితే రామ్ చిత్రాలు రెడ్ మరియు వారియర్ బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం రామ్ తన ఆశలన్నీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రంపై పెట్టుకున్నాడు. బోయపాటి బాలకృష్ణతో అఖండ తో అఖండ విజయం సాధించడంతో, ఈ చిత్రం పై అంచనాలు పెరుగుతున్నాయి.

పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ శరవేగంగా సాగుతోంది మరియు తాజా సమాచారం ప్రకారం, బోయపాటి రామ్‌పై ఒక ప్రత్యేక పాటను చిత్రీకరించడానికి సిద్ధమవుతున్నాడు.  ఈ పాట కోసం హాట్ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఎంపిక చేశారు.  ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ఈ పాట  చిత్రీకరణ జరుగుతోంది. రామ్, ఊర్వశి రౌతేలా  పై పాట చిత్రీకరణ అక్టోబర్ 26, 2022 వరకు కొనసాగుతుంది.

ఈ చిత్రంలో శ్రీ లీల కథానాయికగా నటిస్తుండగా, థమన్ సంగీతం సవరపరుస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా , పవన్ కుమార్ లావిష్‌గా సమర్పిస్తున్నారు.

Advertisement
CJ Advs

Ram readying for a sizzling special song with Urvashi Rautela:

<span>Ram set to shoot for the item song with bollywood beauty&nbsp;Urvashi Rautela</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs