Advertisement
Google Ads BL

రావణ సంహారానికి కదిలిన రాఘవుడు ప్రభాస్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ఆది పురుష్ నుంచి స్పెషల్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. సీతమ్మను అపహరించిన రావణ సంహారం జరగాల్సిందేనని ప్రతిజ్ఞ చేసిన రాఘవుడు వానర సైన్యంతో కలిసి లంకపై దండెత్తిన అపూర్వ దృశ్యాన్ని గుర్తుచేసిందీ పోస్టర్. ఈ పోస్టర్ లో రాముడిగా పోతపోసినట్లు ప్రభాస్ కనిపించారు. రణక్షేత్రం వైపు దృష్టి సారించే ఆ చూపులు, లక్ష్యం వైపు వడిగా పడే ఆ అడుగులు, శత్రువును చీల్చేందుకు సిద్ధమైన విల్లంబులతో రాముడి కార్యదీక్షను ప్రభాస్ తన ఆహార్యంలో అద్భుతంగా చూపించారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆది పురుష్ నుంచి విడుదల ఈ లుక్ అభిమానులను అలరిస్తోంది. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో  ట్రెండింగ్ అవుతోంది.

Advertisement
CJ Advs

ఆదిపురుష్ చిత్రాన్ని పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమయ్యారు. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్ లో వచ్చే సంక్రాంతి పండక్కి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Adipurush: Prabhas looks Royal as Ram:

Adipurush kickstarts Prabhas B-Day celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs