Advertisement

జగన్ పై పవన్-చంద్ర బాబు సమరశంఖం


ఆంద్ర ప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం జరుగుతున్న పరిణామాలతో అంత్యంత వేగంగా మారుతోంది. కొద్దికాలం క్రితం చంద్ర బాబు ని వ్యక్తిగతంగా అసెంబ్లీలో దూషించి, ఏడిపించి పైశాచికానందం పొందిన జగన్ మోహన్ రెడ్డి అయన మంత్రులు, అదే తంత్రాన్ని పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించారు. ప్రతి నిత్యం పవన్ కళ్యాణ్ ని దూషించటమే పనిగా పెట్టుకున్న జగన్ మంత్రులు, పవన్ విశాఖపట్నం పర్యటనలో ప్రయోగించారు.

Advertisement

విశాఖపట్నంనుంచి అవమానకరంగా పవన్ కళ్యాణ్ ని పంపించేసి సంబరాలు జరుపుకోసాగారు. పవన్ కళ్యాణ్ నిశ్శబ్దంగా పోలీసుల ఆజ్ఞలను పాటించి విజయవాడ వచ్చిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా జగన్ కి ఝలక్ ఇచ్చ్చాడు. 

అవమాన భారంతో హైదరాబాద్ వెళ్ళిపోయి, చంద్రబాబు లాగ కన్నీళ్లు పెట్టుకుంటాడనుకుంటే, పవన్ కళ్యాణ్, జగన్ మరియు అతడి మంత్రుల మీద బాంబుల పేల్చాడు.

ఎవరూ ఊహించని విధంగా, పవన్ కళ్యాణ్ యుధ్ధభేరి మోగించి తన వెంట ఎవరు వచ్చినా రాకున్నా జగన్ కంచుకోటలో అడుగుపెట్టి కుంభస్థలాన్ని బ్రద్దలుకొడతానని శపధం చేసాడు. పవన్ కళ్యాణ్ ప్రసంగంతో ఉత్తేజితుడైన మాజీ సీఎం, మరియు టి.డి.పి అధినేత చంద్ర బాబు నాయుడు వెంటనే పవన్ కళ్యాణ్ ని కలిసి సంఘీభావం ప్రకటించాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్, చంద్ర‌బాబు మ‌ధ్య స‌మావేశం ఏపీ రాజ‌కీయాల్లో స‌మూల మార్పుకు సంకేత‌మ‌వ‌డంతో పాటు జ‌గ‌న్‌కి మరిన్ని నిద్రలేని రాత్రలు ఇవ్వడానికి వీరిద్దరూ చేతులు కలుపుతారని పలువురు భావిస్తున్నారు.

Chandrababu-Pawan to give jolt to Jagan:

Chandrababu-Pawan Kalyan signal a drastic change
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement