Advertisement
Google Ads BL

సమంత యశోద రిలీజ్ డేట్ ఫిక్స్


సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా యశోద. హరి మరియు హరీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 

Advertisement
CJ Advs

ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్. సాధారణంగా థ్రిల్లర్ అంటే మిస్టరీ అనుకుంటారు. కానీ, ఇందులో హ్యుమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. వినూత్నమైన కథతో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ యశోద. టైటిల్ పాత్రలో సమంత అద్భుతంగా నటించారు. యాక్షన్ సన్నివేశాల కోసం ట్రైనింగ్ తీసుకుని, చాలా ఎఫర్ట్స్ పెట్టి క్యారెక్టర్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారు. మణిశర్మ నేపథ్య సంగీతం కొత్త డైమెన్షన్‌లో ఉంటుంది. ఈ వారంలో సెన్సార్ పూర్తవుతుంది. సాంకేతికంగా ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా భారీ నిర్మాణ వ్యయంతో 100 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. కొత్త కంటెంట్ కావాలని కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం యశోదలో ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నవంబర్ 11, 2022న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తాం అని సినిమా నిర్మాత చెప్పారు.

Samantha Yashoda movie releasing on November 11th:

Samantha - Sridevi Movies Yashoda movie releasing on November 11th, 2022.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs