Advertisement
Google Ads BL

కాంతార కలెక్షన్ల ప్రభంజనం


కన్నడలో కెజియఫ్ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం కాంతార. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది.

Advertisement
CJ Advs

మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం నేడు 20 కోట్లు గ్రాస్ ను సాధించింది. ఒక చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఈ స్థాయిలో విజయం అవ్వడం అనేది అరుదైన విషయం.కాంతార చిత్రం రిలీజైన పదిహేడవ రోజు కూడా 900 శాతం కలక్షన్స్ పెరగడం అనేది కాంతార చిత్రం విజయానికి నిదర్శనం. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టింది. తెలుగులో రెండో రోజు 11.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ కాంతార క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి. అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగు లో కూడా అంతకు మించిన విజయఢంకాను మోగిస్తుంది.

Kantara Telugu creates sensation :

Rishab Shetty Kantara Telugu creates sensation by collecting more than Day 1 on Day 2 at the BO
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs