టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లోను వరస ఆఫర్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కృతి శెట్టి కి ఇప్పుడు పాన్ ఇండియా ఆఫర్ తగిలింది. SIIMA అవార్డ్స్, ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో సారీస్ తో క్యూట్ గా మెస్మరైజ్ చేసిన కృతి శెట్టి మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీలో మెరవబోతుంది.
టొవినో థామస్ తన కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం అజయంతే రందం మోషణం. ఈ చిత్రంతో జితిన్ లాల్ దర్శహకుడిగా పరిచయమవుతున్నారు. మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టోవినో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. టైటిల్ క్యారెక్టర్స్ మణియన్, అజయన్, కుంజికే పాత్రలు పోషించనున్నారు. అజయంతే రందం మోషణం పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం 3డిలో విడుదల కానుంది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ , సురభి లక్ష్మి కథానాయికలుగా నటిస్తున్నారు. కృతి శెట్టికి ఇది మొదటి మలయాళ చిత్రం.