Advertisement
Google Ads BL

ఈ టీవీలో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌.. ఒకరికి ఒకరు


ఈ టీవీలో ట్రెండీగా రాబోతున్న సరికొత్త రియాలిటీ షో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌....ఒకరికి ఒకరు, తెలుగు టీవి రంగంలో గత పదేళ్లుగా విశిష్ట సేవలందిస్తుంది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. దర్శకుడు అనిల్‌ కడియాలను, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థను ఈటీవి మొదటినుండి ఎంతో సపోర్టు చేయటంతో అనేక బ్లాక్‌బస్టర్‌ టీవీషోలను అనిల్‌ తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఉదాహరణకు అనిల్‌ కడియాల దర్శకత్వంలో ఈ టీవీలో గత ఆరేళ్లుగా అలీతో సరదాగా ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. వావ్‌, పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి అనేక షోలతో పాటు పండగల పూట ప్రసారమయ్యే స్పెషల్‌ షోలను డిజైన్‌ చేసి దర్శకత్వం వహించారు అనిల్‌ కడియాల. ఈ షోలన్నింటికి కంటెంట్‌ పార్టును దగ్గరుండి చూసుకుంటూ నిర్మాతగా వ్యవహరించే వ్యక్తే ప్రవీణా కడియాల. నిర్మాత–దర్శకులిద్దరూ భార్య, భర్తలు కావటంతో ఎంత పెద్ద షోనైనా సక్సెస్‌ బాట పట్టించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇదే స్పీడుతో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఒకరికి ఒకరు అనే ట్యాగ్‌లైన్‌తో సరికొత్తగా షోను డిజైన్‌ చేసి పది ఫేమస్‌ జంటలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కంటెంట్‌ను ఎంతో క్రియేటివ్‌గా డిజైన్‌ చేసిన నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ.. ఈటీవిలో అక్టోబర్‌ 11న ప్రారంభం అవుతుంది మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఒకరికి ఒకరు. ప్రతి మంగళవారం రాత్రి 9–30నిమిషాలకు ప్రసారం కానున్న ఈ షోద్వారా ప్రముఖ నటి స్నేహ తొలిసారి జడ్జిగా వ్యవహరిస్తుండటం విశేషం. స్నేహతో పాటు నటుడు శివబాలాజి ఒక జడ్జిగా వ్యవహరిస్తుండగా బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచి ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ స్లోగన్‌ను తెలుగువారికి పరిచయం చేసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పెషల్‌ జడ్డిగా వ్యవహరించటం ఈ షోకే హైలెట్‌. ఈ షోలో పాల్గొంటున్న పది జంటలకు రకారకాల టాస్క్‌లు ఉంటాయి. ఆ టాస్క్‌ల్లో విజేతగా నిలిచిన వారు ఫైనల్‌కి వెళ్లి గ్రాండ్‌ ఫినాలే టైటిల్‌తో పాటు భారీ ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారు అన్నారామే.

Advertisement
CJ Advs

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ పోటీలో పాల్గొంటున్న పదిజంటలు.. 1.రవికిరణ్‌–సుష్మా 2.పవన్‌–అంజలి 3.సందీప్‌–జ్యోతి 4.హ్రితేష్‌–ప్రియా 5.శ్రీవాణి–విక్రమ్‌ 6.మధు–ప్రియాంక 7.ప్రీతమ్‌–మానస 8.సిద్దు–విష్ణుప్రియ 9.రాకేశ్‌–సుజాత 10.విశ్వ–శ్రద్ధ ఈజంటలందరూ బుల్లితెరపై అందరికి సుపరిచితులే. అనేక సందర్భాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నవారే. ఈ అందరినీ కలుపుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌తో మాస్‌ అభిమానులను సొంతం చేసుకున్న లేడి మాస్‌ స్టార్‌ శ్రీముఖి ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

Mr. and Mrs. Reality show in ETV:

Mr. and Mrs. Reality show Launching on ETV October 11th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs