Advertisement
Google Ads BL

సక్సెస్ ఫార్ములా పట్టుకున్న దర్శకుడు మారుతి


ఆడియన్స్ కి ఇష్టమైన సినిమాలు మాత్రమే తియ్యాలి, మనకు ఇష్టమైన సినిమాలను వాళ్ళ మీదకి రుద్దకూడదు అని సక్సెస్ ఫార్ములా పట్టుకున్న దర్శకుడు మారుతి.

Advertisement
CJ Advs

సినిమా కెరీర్ మొదలు పెట్టక సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, యాడ్స్‌ డిజైనర్‌గా పని చేసిన మారుతి, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 5డి క్యామ్ తో చేసినదొంగలముఠా సినిమా నుంచి ఇన్స్పైరై, 5డి క్యామ్ తో ఆ రోజుల్లోనే  ఈరోజుల్లో అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి యూత్ ను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత బస్‌ స్టాప్‌ మూవీని తెరకెక్కించాడు. ఈ రెండు చిన్న చిత్రాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. దీంతో ప్రేమకథా చిత్రంతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు మారుతి.

యూత్ కి దగ్గరయ్యే సినిమాలు మాత్రమే కాకుండా అల్లు శిరీష్‌తో కొత్తజంట, వెంకటేశ్‌తో బాబు బంగారం, నానితో భలే భలే మగాడివోయ్‌, శర్వానంద్‌తో మహానుభావుడు, నాగచైతన్యతో శైలజారెడ్డి అల్లుడు, సాయిధరమ్‌ తేజ్‌తో ప్రతిరోజు పండగే.. ఇలా ఎన్నో సినిమాలను డైరెక్ట్‌ చేసి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దర్శకుడు మారుతి. 

30 రోజుల్లో సినిమా చేయడం అంటే మాటలు కాదు. 

కేవలం నెల రోజుల్లోనే మంచిరోజులొచ్చాయి అనే సినిమాను తీసి.. విడుదలకు సిద్ధం చేసాడు మారుతి. వినోదభరితమైన చిత్రాలకు ప్రాధాన్యతను ఇచ్చే మారుతి  ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాను చేస్తున్నాడు. అనుకుంటే అసాధ్యం ఏదీ లేదని,  మాటల్లో కాకుండా  చేతల్లో చూపించాడు దర్శకుడు మారుతి. ఇలానే మరిన్ని హిట్ చిత్రాలని చేస్తూ విజయాలను అందుకోవాలని మారుతి పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు.

Director Maruti Birthday Special:

Director Maruti Birthday Special article 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs