Advertisement
Google Ads BL

హీరో ఆకాష్ పూరి క్లాప్ తో.. మహీంద్ర పిక్చర్స్


హీరో ఆకాష్ పూరి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన  మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం

Advertisement
CJ Advs

మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి, రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా  కార్యక్రమాలు హైదరాబాద్ లోని సత్యసాయి కల్యాణమండపం లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి  హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన  పాత్రికేయుల సమావేశంలో 

చిత్ర దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ  దసరా శుభాకాంక్షలు. నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి  ముందుకు వచ్చారు నిర్మాత వి.శ్రీనివాస రావ్ గారు. వారికి నా ధన్యవాదాలు. హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు లు వచ్చి మమ్మల్ని బ్లేస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబందించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమాకు అందరూ కొత్త వారైనా చాలా మంది సీనియర్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నందున ఈ సినిమా కొత్త వారు తీసినట్టు ఉండదు. ఈ నెల 17 నుండి చీరాలలో మొదటి షెడ్యూల్ జరుపుకొని  హైదరాబాద్ లో జరిగే రెండవ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేసుకొంటామని అన్నారు.

చిత్ర నిర్మాత వి.శ్రీనివాస రావ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ  దసరా శుభాకాంక్షలు. మేము పిలవంగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు గార్లకు ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా. దర్శకుడు వెంకటేష్ గారు చెప్పిన కథ నచ్చడంతో మహీంద్ర పిక్చర్స్  పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నాను. ప్రేక్షకులందరికి నచ్చేవిధమైన అన్ని అంశాలతో  వస్తున్న ఈ సినిమా మా బ్యానర్ కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

చిత్ర హీరో చైతన్య పసుపులేటి మాట్లాడుతూ.. ఇది నా మూడవ సినిమా వెంకటేష్ గారు నా మెదటి సినిమా నుండి తెలుసు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన  దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.మంచి టీం, మంచి కథతో తీస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

Mahindra Pictures New Movie:

Mahindra Pictures production number 1 film started with hero Akash Puri clap
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs