Advertisement
Google Ads BL

భారీ షెడ్యూల్ తో మొదలైన RAPO20


బోయపాటి శ్రీను-రామ్ పోతినేని కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోయే RAPO20 అఫీషియల్ గా పట్టాలెక్కింది. దసరా సందర్భంగా రామ్ సరసన హీరోయిన్ గా శ్రీ లీలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎస్. తమన్ మ్యూజిక్ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది. 

Advertisement
CJ Advs

నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి మాట్లాడుతూ.. మా దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ విజయం తర్వాత చేస్తున్న చిత్రమిది. ఆ సినిమాకు రోరింగ్ రీ రికార్డింగ్ అందించిన తమన్ మా సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. వాటికి తగ్గట్టు సినిమా ఉంటుంది. రామ్ ఎనర్జీకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే క్యారెక్టర్‌ను బోయపాటి శ్రీను డిజైన్ చేశారు. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. 

స్టంట్ శివ నేతృత్వంలో ఆ యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్నాం. సుమారు 30 రోజులు ఈ షెడ్యూల్ ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఉన్నత సాంకేతిక విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ చిత్రమిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ - ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తాం.. అని చెప్పారు.

RAPO 20 regular shoot begins:

RAPO 20 regular shoot update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs