Advertisement
Google Ads BL

అన్ స్టాపబుల్2 టీజర్: బాలయ్య ఆన్ ఫైర్


బాలకృష్ణ ఈమధ్యన లుక్స్ తో అభిమానులని మెస్మరైజ్ చేస్తున్నారు. ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య గెటప్స్, బాలయ్య ఫ్యాబ్యులస్ లుక్స్, ఆయన హెయిర్ స్టయిల్ కి అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకుడు కూడా మాట్లాడుకునేలా చేసారు. అంతేకాకుండా టాక్ షో లో బాలయ్య మాటలు, గెస్ట్ లతో ఆయన నడుచుకున్న తీరు అన్ని ఆహా అన్ స్టాపబుల్ ని అందనంత ఎత్తులో నిలబెట్టాయి. టాక్ షోస్ లో నెంబర్ వన్ టాక్ షో గా రికార్డ్ లు క్రియేట్ చేసి సీజన్ 2 పై అంచనాలు ఆసక్తిని పెంచేసింది. సీజన్ 2 తో బాలయ్య ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవడమే కాదు, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అన్ స్టాపబుల్ సీజన్ 2 టీజర్ ని విజయవాడలో అభిమానులు మధ్యన రిలీజ్ చేసారు.

Advertisement
CJ Advs

టీజర్ లో బాలకృష్ణ లుక్ చూస్తే అభిమానులు ఆగలేరు, పూనకాలే. బాలకృష్ణ ఆన్ ఫైర్ అన్న రేంజ్ లో ఆయన ఎంట్రీ అద్భుతమే. The Man Of Masses NBK, అంటూ కాపాలాన్ని కాలితో తొక్కి చేతితో కత్తి పట్టుకుంటే.. చేతిలో కొరడా కాదు.. అగ్గి తో ఫేస్ రివీల్ చేస్తే ఏమంటారు.. బాలయ్య ఆన్ ఫైర్ అంటారు. తలకి టోపీ పెట్టుకుని కౌ బాయ్ లా కనిపించారు. అది బాలయ్య సీజన్ 2 లుక్, కాస్ట్యూమ్స్. దెబ్బకి థింకింగ్ మారిపోవాలా అంటూ పవర్ ఫుల్ టైటిల్ కార్డు తో నందమూరి నటసింహం లుక్ కి ఫాన్స్ దబిడిదిబిడే.. 

Un stoppable With NBK Season 2 teaser :

Un stoppable With NBK Season 2 teaser revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs