Advertisement
Google Ads BL

ఆదిపురుష్ టీజర్ కి రికార్డ్ వ్యూస్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రెస్టీజియస్ మూవీగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరంలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుకను ఘనంగా నిర్వహించారు. 

Advertisement
CJ Advs

ఈ టీజర్ కు రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. 24 గంటల్లో 101 మిలియన్ వ్యూస్ తో ఇండియాలోనే నెం 1 టీజర్ గా రికార్డు నెలకొలపడమే కాకుండా, యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో నిలిచింది. త్రీడీ ఫార్మేట్ లో ఈ టీజర్ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది. ఇదే అనుభూతి సినిమా రిలీజ్ అయ్యాక 3డిలో కలుగుతుందని నిర్మాతలు చెప్తున్నారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల ప్రపంచస్థాయి సినిమాను మనం ఇప్పటివరకూ ఎంజాయ్ చేస్తున్నాం. ఆదిపురుష్ కూడా అలాంటి వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కింది.

వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఆదిపురుష్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మేట్ తో పాటు త్రీడీలో ఈ సినిమా తెరపైకి రానుంది.

The Adipurush teaser - A 3D cinematic treat!:

Adipurush is a matter of pride for India
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs