Advertisement
Google Ads BL

ది ఘోస్ట్ కంప్లీట్ ఫిక్షన్ స్టొరీ: ప్రవీణ్ సత్తారు


కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్. పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో దర్శకుడు  ప్రవీణ్ సత్తారు  విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు

Advertisement
CJ Advs

ది ఘోస్ట్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?

ఘోస్ట్ అనేది ఊహాతీతమైన పదం. రా, ఇంటల్జెన్స్ ఫీల్డ్ లో ఈ పదానికి ఒక పవర్ వుంది. ఘోస్ట్ ప్రోటోకాల్ అని అంటారు. ఇందులో కథానాయకుడి కోడ్ ఘోస్ట్. అండర్ వరల్డ్ అతనికి పెట్టినపేరు ఘోస్ట్.

నాగార్జున గారిని కలసి కథ చెప్పడం ఎలా అనిపించింది ?

నిర్మాతలు సునీల్, శరత్ మరార్ లని ముందు కలవడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ చర్చ నడుస్తునపుడు.. వేరేది చేద్దామని నాగ్ సర్ అన్నారు. నాగార్జున గారంటే నా మనసులో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వుంది. ఆ రకంగా చూపించాలని కథ రాయడం జరిగింది. నా కెరీర్ లో హీరోకి కథ రాయడం ఇదే తొలిసారి. ఆయన ఇంటన్సిటీ, స్టయిల్, గ్రేస్ ఉపయోగించుకొని, ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. 

తొలిసారి హీరో అనుకోని కథ రాశారు కదా ? ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ?

నిజానికి హీరోకి కథ రాయడం ఈజీ. మనకి ఒక స్పష్టమైన క్లారిటీ, డైరెక్షన్  వచ్చేస్తుంది. మన బౌండరీలు మనకి తెలిసిపోయినప్పుడు ఆ పరిధిలోనే ఆలోచిస్తాం. నాకు అడిగితే ముందు కథ రాసుకొని తర్వాత అందులో నటులని ఫిట్ చేయడమే కష్టం.

ది ఘోస్ట్ లో తమహగనే లాంటి ఆయుధాలు కూడా డిజైన్ చేశారు కదా ?

కథ రాసుకున్నపుడు ప్రతి పాత్రకు ఒక బ్యాక్ స్టొరీ రాస్తాం. అలాంటి బ్యాక్ స్టొరీ ఉన్నపుడే పాత్రకు బలం చేకూరుతుంది. నాగార్జున గారు ఇందులో 40 ఏళ్ల ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తారు. అయితే ఈ జర్నీలో ఆయన చాలా మిషన్స్ లో పాల్గొనివుంటారు. అలా తన జర్నీ లో జపాన్ వెళ్లినపుడు అక్కడ ఒక వ్యక్తి ఇచ్చే మెటల్ తమహగనే. ది ఘోస్ట్ కంప్లీట్ ఫిక్షన్ స్టొరీ. 12 యాక్షన్ సీక్వెన్స్ లు వుంటాయి. 

హీరోయిన్ సోనాల్ చౌహాన్ గురించి ?

సోనాల్ చౌహాన్ చాలా అంకిత భావంతో పని చేసే నటి. మాకు చాలా సమయం ఇచ్చి చాలా హార్డ్ వర్క్ చేసి బ్రిలియంట్ ఫెర్ ఫార్మ్ చేసింది.

మీ తొలి మూడు చిత్రాలు సొంత ప్రొడక్షన్ లో చేశారు కదా.. ఇప్పుడు వేరే ప్రొడక్షన్.. ఈ విషయంలో ఎలాంటి తేడాలు..  సవాళ్ళు  వుంటాయి?

క్రియేటివ్ గా ఆలోచిస్తే సొంత ప్రొడక్షన్ నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు. సొంత ప్రొడక్షన్ చేయడం వలన నిర్మాత కష్టాలు కూడా తెలుసు. ఎంతవరకూ రాజీపడాలో తెలుసు. అయితే సొంత ప్రొడక్షన్ లో రిలీజ్ సమయంలో సమస్య వస్తుంది. సినిమాని రిలీజ్ చేయడం అంత తేలిక కాదు. మంచి ప్రోడక్ట్ ని రెడీ చేసిన తర్వాత దాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది చాలా ముఖ్యం. నా ప్రొడక్షన్ లో వచ్చిన చిత్రాలకు రిలీజ్ దగ్గర ఇబ్బందిపడ్డా.  

ది ఘోస్ట్ విషయంలో మీరు ఎదురుకున్న పెద్ద సవాల్ ఏంటి ?

కోవిడ్ (నవ్వుతూ). సెకండ్ వేవ్ , థర్డ్ వేవ్ వలన షూటింగ్ షెడ్యుల్ కొంచెం డిస్టర్బ్ అయ్యాయి. దుబాయి లో షూట్ అనుకున్నాం. రెండు రోజుల ముందు క్యాన్సిల్ అయ్యింది. తర్వాత అక్కడికి వెళితే ముందు రెక్కీకి వెళ్ళిన యాక్షన్ కొరియోగ్రఫర్ అందుబాటులోకి రాలేదు. కొత్తతని తో చేయాల్సి వచ్చింది. కోవిడ్ నిబంధనలు కారణంగా షూటింగ్ అనుమతులు కూడా కష్టమయ్యాయి.

ఎక్కువ నార్త్ నటీనటులు వున్నారు కదా ?

పాత్రలకు తగ్గట్టుగానే ఎంపిక చేశాం, నార్త్ అయినప్పటికీ డబ్బింగ్ వారే చెప్పారు.

ది ఘోస్ట్ ఎలా వుండబోతుంది ?

హై ఎమోషన్స్ హీరోయిజం వున్న చిత్రమిది. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి. విజల్ వేసే మూమెంట్స్ కూడా వుంటాయి. క్లాస్ గా తీసిన పక్కా మాస్ ఫిల్మ్ ఇది. థియేటర్లో ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 

కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారిందని అంటున్నారు.. ఇలాంటి సమయంలో ఒక కథ రాసినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?

కోవిడ్ వలన ఒక మేలు జరిగింది. అందరూ వరల్డ్ సినిమాకి అలవాటు పడ్డారు, సినిమా అంటే ఎలాంటి క్యాలిటీ, మంచి సినిమా ఎదో ఉండాలో ప్రేక్షకులకు తెలిసింది. ఏది థియేటర్ సినిమా నో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఫోన్ లో కాకుండా ఒక సినిమాని థియేటర్లోనే చూడాలనే భావన ప్రేక్షకులకు కలిగించాలి. 

ది ఘోస్ట్ విడుదలైన రోజునే చిరంజీవి గారి గాడ్ ఫాదర్ విడుదలౌతుంది కదా ? పోటీ ఎలా వుండబోతుందని భావిస్తున్నారు ?

ఇందులో పోటీ లేదు. రెండు భిన్నమైన సినిమాలు. బావున్న ప్రతి సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారని నమ్ముతాను.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?

వరుణ్ తేజ్ గారితో సినిమా అక్టోబర్ 10 నుండి యూకే లో మొదలౌతుంది. ఒక వెబ్ సిరిస్ ప్లాన్ కూడా వుంది.

Praveen Sattaru Interview:

Praveen Sattaru Interview about The Ghost
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs