Advertisement
Google Ads BL

స్పార్క్ విలన్ మిన్నల్ మురళి


శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోన్న యాక్షన్ థ్రిల్లర్ స్పార్క్.. ప్రతి నాయ‌కుడిగా మిన్నల్ మురళి ఫేమ్ గురు సోమ సుందరం.

Advertisement
CJ Advs

విక్రాంత్ హీరోగా ప‌రిచ‌య‌మవుతున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ స్పార్క్. ఛార్మింగ్ బ్యూటీస్‌ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ అన్‌కాంప్రైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తోంది. అనౌన్స్‌మెంట్ రోజునే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ మూవీలో టాలెంటెడ్ యాక్ట‌ర్, మిన్నల్ మురళి ఫేమ్ గురు సోమ‌సుంద‌రం విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అరవింద్‌ కుమార్‌ రవి వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి వర్మ ఇంతకు మునుపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు కాబట్టి సినిమాటోగ్రఫీని కూడా హ్యాండిల్‌ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అక్టోబ‌ర్ 3 నుంచి ఐస్‌ల్యాండ్‌లో షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత మున్నార్‌, వైజాగ్‌ల్లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నాం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని సార‌థి స్టూడియోలో వేసిన రెండు భారీ సెట్స్‌లో షూటింగ్ జ‌రుగుతోంది అని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

హృద‌యం ఫేమ్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ సినిమాకు ట్యూన్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది స్పార్క్. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కీ రోల్స్ కోసం రీసెంట్‌గా వెర్సటైల్ ఆర్టిస్ట్ నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం జాయిన్ అయ్యారు. వీరితో పాటు వెన్నెల కిశోర్, షాయాజీ షిండే, సత్య, శ్రీకాంత్‌, కిరణ్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Minnal Murali is the spark Movie villain:

Spark Movie shooting will take place in Iceland from October 3rd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs