Advertisement
Google Ads BL

సూర్య 42 మోషన్ పోస్టర్ రిలీజ్


యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను ఇన్ స్పైర్ చేసేలా సౌత్ స్టార్ సూర్య కొత్త సినిమా సూర్య 42 మోషన్ పోస్టర్ వచ్చేసింది. ఈ మైటీ వైలెంట్ సాగాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్ పోస్టర్ లోని గ్రాండియర్ చూస్తుంటే ఇండియన్ స్క్రీన్ మీద ఇదొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రానుందని తెలుస్తోంది. సూర్య లుక్, అద్భుమైన మూవీ డిజైనింగ్, అన్ కాంప్రమైజ్డ్ మేకింగ్ తో సూర్య 42 ఫరెవర్ స్పెషల్ మూవీ కాబోతోంది. చిత్ర నిర్మాణంలో కేఈ జ్ఞానవేల్ రాజా, యూవీ క్రియేషన్స్ అభిరుచిని ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రదర్శించాయి. ఆగస్టు 8న ప్రారంభమైన ఈ సినిమా అదే రోజు రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో 10 భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దిశా పటానీ సూర్య తో రొమాన్స్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

సూర్య అభిమానులకు 2022 బెస్ట్ ఇయర్ గా నిలిచిపోతుంది. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడిగా సురరై పొట్రుకు అవార్డ్ దక్కడం, ఆస్కార్ జ్యూరీలో మెంబర్ గా సెలెక్ట్ అవడం, విక్రమ్ లో రోలెక్స్ గా మెరవడం..ఇవన్నీ ఫ్యాన్స్ ను ఖుషి చేశాయి. ఇప్పుడీ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో అభిమానుల ఉత్సాహం మరింత పెరుగుతోంది.ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

Suriya 42 Stunningly Captivating Motion Poster:

Suriya and UV Creations Suriya 42 Stunningly Captivating Motion Poster Is Here 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs