సుధీర్ బాబు హీరోగా మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి టైటిల్ రివీల్ అంటూ గత రెండు రోజులుగా ఎంతో క్యూరియాసిటీని పెంచుతూ వచ్చిన మేకర్స్ తాజాగా సుధీర్ బాబు కొత్త చిత్రానికి హంట్ టైటిల్ ఖరారు చేసినట్లు ఈ రోజు వెల్లడించారు.
సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. ఈ ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్ ఫిల్మ్. ఇప్పటి వరకు వచ్చిన సుధీర్ బాబు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సులు చాలా సహజంగా, కొత్త అనుభూతి ఇచ్చేలా ఉంటాయి. కనిపించని శత్రువు కోసం జరిపే వేట ఈ సినిమా ప్రధాన కథాంశం. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.