Advertisement
Google Ads BL

చిరంజీవి గారికి థాంక్స్: మణిరత్నం


 

Advertisement
CJ Advs

మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్‌ సినిమా పొన్నియిన్‌ సెల్వన్‌. రెండు భాగాలుగా విడుదల కానున్న పొన్నియిన్‌ సెల్వన్‌. పీయస్‌-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పీయస్‌-1 నుండి తాజాగా చోళ చోళ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో 

చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.. నాకు మణి సర్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఆయనతో ఇది వరకు రావణ్ సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను. మణి గారితో పని చేస్తున్నానంటూ అది నాకు కల నెరవేరడం వంటిది. మణిగారు, శంకర్ గారితో సినిమా చేస్తే ఇక రిటైర్ అవ్వొచ్చుని అనుకున్నాను. అంత అద్భుతమైన చిత్రాలు చేస్తారు. మణిగారి సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్ అని అన్నారు.

మణిరత్నం మాట్లాడుతూ.. చిరంజీవి గారికి థాంక్స్ చెప్పాలి. కానీ అది ఎందుకు అనేది చెప్పను. తరువాత మీకే తెలుస్తుంది. రాజమౌళి గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన వల్లే ఇలాంటి చిత్రాలు తీయగలమనే ధైర్యం వచ్చింది. రెండు పార్టులుగా ఇలాంటి చిత్రాలు తీసి మెప్పించవచ్చని నిరూపించారు. అందుకే ఆయనకు థాంక్స్. నా బిడ్డ లాంటి ఈ చిత్రం ఇక దిల్ రాజు గారిదే. ఆయనే తెలుగులో ఈ సినిమాను చూసుకోవాలి. తనికెళ్ల భరణి గారికి థాంక్స్. చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాను తీయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

Chola Chola single from PS1 OUT NOW:

PS1 song launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs