Advertisement
Google Ads BL

ఆగస్ట్ 25న మంచు విష్ణు జిన్నా టీజర్


మంచు విష్ణు తాజా చిత్రం జిన్నా టీజర్ ను ఆగస్ట్ 25న  విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది. బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోంది. పాయల్ రాజ్ పుత్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన హీరోయిన్స్ ఇద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Advertisement
CJ Advs

సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న జిన్నా చిత్రం పై ఇప్పటికే ఆసక్తి నెలకొని ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో విష్ణుతో స‌న్నీ రీల్స్... విష్ణు, ఆయ‌న బృందంతో సన్నీ ఓ చమత్కారమైన రీల్స్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించారు. RRR నాటు నాటు ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త‌న సంగీతంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఉర్రుత‌లూగించే అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతుండగా ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Manchu Vishnu Ginna Movie Teaser On August 25th:

Ginna Telugu Movie Teaser Releasing On August 25th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs