Advertisement
Google Ads BL

వెరైటీ పాటతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి


సమ్మోహనంతో సక్సెస్ సాధించిన సుధీర్ బాబు - మోహనకృష్ణ ఇంద్రగంటిల కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా బబ్లీ  బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌ పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి మీరే హీరో లాగ పాటని విడుదల చేయగా దర్శకుడు హను రాఘవపూడి ఈవెంట్ కి అతిధిగా పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. సినిమాలని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి జర్నలిస్ట్ లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. నటీనటులకు ఎంత ప్యాషన్ వుంటుందో జర్నలిస్ట్ లు కూడా అంతే ప్యాషన్ తో పని చేస్తారు. మీరే హీరోలా వున్నారు పాట ప్రెస్ సమక్షంలో విడుదల చేయడం ఆనందంగా వుంది. ఈ పాటని ప్రెస్, మీడియాకి డెడికేట్ చేస్తున్నాం. ఇంద్రగంటి గారు కథకు న్యాయం చేసే దర్శకుడు . ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. కృతి ఇందులో అద్భుతమైన పాత్ర చేసింది. ఉప్పెన వల్ల ఆమెకు పది సినిమాలు వస్తే ఈ సినిమాతో కృతి టాలీవుడ్ లో స్థిరపడిపోతుంది. పీజీ విందా గారితో ఇది నా నాలుగో సినిమా. వివేక్ సాగర్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు మహేంద్ర బాబు, సుధీర్ బాబు, కిరణ్ కి ఇది పర్ఫెక్ట్ లాంచ్. సినిమా చాలా రిచ్ గా వుంటుంది. మహేష్ బాబు సినిమా ఎంత రిచ్ గా వుంటుందో ఈ సినిమాలో కూడా అంతే రిచ్ నెస్ వుంటుంది. ఇంద్రగంటి గారి బెస్ట్ మూవీ ఇది. ప్రేమకథతో పాటు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా వుంటుంది  అన్నారు. 

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. నేను కూడా జర్నలిస్ట్ గా పని చేశాను. చాలా ఇంటర్వ్యూ లు చేశాను. ఒక ఇంటర్వ్యూ తరహాలో హీరో ఇంట్రో సాంగ్ వుంటే ఎలా వుంటుందనే ఆలోచనని రామజోగయ్య శాస్త్రి గారికి చెప్పాను. ఈ పాట కంపోజిషన్ ఒక సవాల్ తో కూడుకున్నది. సంభాషణని సంగీతంలో ఇమడ్చడం కష్టమైన పక్రియ. వివేక్ వండర్ ఫుల్ గా కంపోజ్ చేశారు. దినేష్ దీనికి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. సుధీర్ నా ఫేవరేట్ నటుడు. కృతిని ఉప్పెన కంటే ముందే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా కొత్త కృతి కనిపిస్తుంది. నిర్మాతలకు మంచి అభిరుచి వుంది. ఇది నా మోస్ట్ ఎమోషనల్ ఫిల్మ్ అన్నారు

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ఇంద్రగంటి మోహన కృష్ణ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన తీసిన గ్రహణం, సమ్మోహనం  నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ సహజంగా వుంటాయి. సుధీర్ బాబు గారు ప్రతి సారి కొత్తగా కనిపిస్తారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. 

కృతి శెట్టి మాట్లాడుతూ.. సుధీర్ గారు ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. సుధీర్ గారితో నటించడం హ్యాపీ. నటనకు ఆస్కారం వుండే మంచి పాత్రని ఇచ్చిన ఇంద్రగంటి గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం కోసం పని చేసిన యూనిట్ అంతటికి థాంక్స్ అన్నారు. 

సమర్పకులు గాజులపల్లె సుధీర్ బాబు మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితమే సినిమా చూశాం. అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా హిట్ కొడతాం అన్నారు. 

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఇంద్రగంటి క్రియేటివ్ డైరెక్టర్. ఆయనతో పని చేస్తే మనలో కొన్ని కొత్త కోణాలు బయటికి వస్తాయి. ఆయన దర్శకత్వంలో మ్యాజిక్ వుంటుంది. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అన్నారు. 

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారితో మరోసారి పని చేయడం చాలా ఆనందంగా వుంది. బెంచ్ మార్క్ బ్యానర్ కి ఆల్ ది బెస్ట్. సెప్టెంబర్ 16 న సినిమా వస్తోంది.  మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు. 

డీవోపీ పీజీ విందా మాట్లాడుతూ.. సుధీర్ బాబు ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారు. ఇంద్రగంటి గారు చాలా మంచి సినిమా తీశారు అంటూ యూనిట్ మొత్తానికి థాంక్స్ చెప్పారు.

ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మాట్లాడుతూ.. గత వారం విడుదలైన కార్తికేయ 2కి ఎలాంటి బ్లెస్సింగ్స్ వచ్చాయో ఈ సినిమాకి కూడా అలానే వస్తాయిని అనుకుంటున్నాను అన్నారు. 

Different Song From Aa Ammayi Gurinchi Meeku Cheeppali Movie:

Aa Ammayi Gurinchi Meeku Cheppali Song Launch Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs