Advertisement
Google Ads BL

రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో 1770


మన భారత జాతీయ గీతం వందేమాతరం సృష్టికర్త, ప్ర‌ముఖ బెంగాళీ ర‌చ‌యిత బంకించంద్ర ఛ‌ట‌ర్జీ ర‌చించిన ఆనంద‌మ‌ఠ్ అనే న‌వ‌ల ఆధారంగా ఓ భారీ చిత్రం రాబోతోంది. 1770 పేరుతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దనున్న ఈ చిత్రం గురించి నిర్మాత‌లు శైలేంద్ర కుమార్, సుజ‌య్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూర‌జ్ శ‌ర్మ వారి తాజాగా ప్రకటించారు. SS1 ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ - PK ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై బాహుభాషా చిత్రంగా  రూపొందనున్న ఈ చిత్రానికి  పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి వద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ఈగ‌, బాహుబ‌లి వంటి భారీ చిత్రాల‌కు ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు దర్శకత్వం వహించనున్నారు. 

Advertisement
CJ Advs

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అశ్విన్ గంగ‌రాజు మాట్లాడుతూ.. ఇది నాకు పెద్ద ఛాలెంజింగ్ స‌బ్జెక్ట్‌. అయితే లెజెండ్రీ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌గారు రచన అందిస్తున్నారు కనుక ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను మాత్ర‌మే నేను తెర‌కెక్కించాలి. అద్బుతమైన పీరియాడిక్ సెట్స్, అద్భుతమైన ఎమోష‌న్స్‌, లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ త‌దిత‌ర ఎలిమెంట్స్ వున్న సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి అన్ని ఎలిమెంట్స్ ఇందులో ప‌క్కాగా స‌రిపోయాయి.  నిర్మాత‌లు  శైలేంద్ర కుమార్, సుజ‌య్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూర‌జ్ శ‌ర్మల‌ను ముంబైలో క‌లిశాను. సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాల‌ని అంద‌రం సుదీర్ఘంగా చ‌ర్చించాం అన్నారు. 

రచయిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ వందేమాతరం అనేది ఓ మ్యాజికల్ పదం. ఆ మంత్రాన్ని బంకించంద్ర ఛ‌ట‌ర్జీ అనే మ‌హ‌ర్షి మ‌న‌కు అందించారు. ఇది జాతినంత‌టినీ ఏకం చేసి పోరాడేలా చేసింది. 1770లో భారత స్వాతంత్య్ర స‌మరం కోసం మ‌న‌లో స్ఫూర్తిని ర‌గిల్చిన యోధులెంద‌రో ఉన్నారు. వారి గురించి తెలియ‌జేసే చిత్ర‌మే 1770’’ అన్నారు.

విజువల్ సూపర్ వైజర్ రామ్ క‌మ‌ల్ మాట్లాడుతూ నా విజన్‌పై న‌మ్మ‌కంతో ముందుకు వ‌చ్చిన నిర్మాత‌లకు కృతజ్ఞతలు. ద‌ర్శ‌కుడిగా అశ్విన్‌లో పాజిటివ్ వైబ్స్ నాకు న‌చ్చాయి. త‌ను విజువ‌ల్‌గా స్టోరినంతంటినీ వివ‌రించాడు. 1770 చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన ర‌చ‌నను చేశారు. ఆయ‌న ఆలోచ‌న‌లు యూనిక్‌గా ఉన్నాయి. క‌చ్చితంగా ఈ సినిమాలో ఆయ‌న క‌థ‌, క‌థ‌నం స‌రిహ‌ద్దుల‌ను దాటి ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

ఎస్‌.ఎస్‌. 1 ఎంట‌ర్‌టైన్మెంట్ శైలేంద్ర కె.కుమార్ మాట్లాడుతూ లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను నిర్మించటానికి ఇదే స‌రైన సమయం. రామ్ క‌మ‌ల్ న‌న్ను క‌లిసి ఆనంద్ మ‌ఠ్ క‌థ గురించి చెప్పారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్‌గారు ఆయ‌న స్టైల్ ఆఫ్ నెరేష‌న్‌ను అందించారు. ఇది సినిమా కాదు.. నా క‌ల నిజ‌మ‌వుతున్న రోజు. వెండితెర‌పై ఓ అద్భుత‌మైన చిత్రం ఆవిష్కృతం కానుంద‌ని  తెలిపారు.  

పి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ అధినేత సూర‌జ్ శ‌ర్మ మాట్లాడుతూ ఈ టీమ్‌లో నేను యంగ్ ప‌ర్స‌న్‌ని. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావ‌టం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అనుభ‌వజ్ఞులు, లెజెండ్స్ నుంచి చాలా కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటాను అన్నారు.

జీ స్టూడియోస్‌పై హిస్టారిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మ‌ణిక‌ర్ణిక చిత్రాన్ని రూపొందించిన సుజోయ్ కుట్టి మాట్లాడుతూ విజయేంద్రప్రసాద్‌గారితో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆయ‌న చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌. ఈ సినిమాకు ఆయ‌న రైట‌ర్ కాకుంటే నేను చేసేవాడిని కాను అన్నారు.

కాగా 1770 చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాళీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యాన్ని ద‌స‌రా ముందు టీమ్ నిర్ణ‌యిస్తుంది. దీపావళి నాటికంతా మొత్తం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులను అనౌన్స్ చేస్తారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు అశ్విన్ త‌న టీమ్‌తో క‌లిసి ఈ పీరియాడిక్ సినిమాను యూనిక్‌గా రూపొందించ‌డానికి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నారు.

Rajamouli protege Ashwin to direct magnum opus 1770:

<span>1770 Movie in the making Based on Bankim Chandras Anandamath navel</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs