Advertisement
Google Ads BL

నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీస్ మార్ ఖాన్ - హీరో ఆది


స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుంది.నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్  ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Advertisement
CJ Advs

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ఆదితో ఇది వరకు నేను సినిమాలు చేశాను. ఇందులో చాలా కొత్తగా ఉంటారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ కారెక్టర్ ఎంట్రీ అయినప్పటి నుంచి వేరే లెవెల్‌లో ఉంటుంది. మా డైరెక్టర్ కళ్యాణ్‌కి పెద్ద కమర్షియల్ హిట్ రాబోతోంది. తిరుపతి రెడ్డన్నకు మంచిగా డబ్బులు రావాలి. పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

సాయి కుమార్ మాట్లాడుతూ.. అడగ్గానే వచ్చిన మా మేజర్‌(అడివి శేష్)కు సెల్యూట్. మా డీజే (సిద్దు జొన్నలగడ్డ) ఇలా రావడం ఆనందంగా ఉంది. నేను, సుధీర్ బాబు కలిసి మళ్లీ తండ్రీ కొడుకుల్లా నటించబోతోన్నాం. 1996 ఆగస్ట్ 16న పోలీస్ స్టోరీ కన్నడలో విడుదలైంది, తెలుగులో డిసెంబర్ 19న విడుదలైంది. మా అబ్బాయి కూడా ప్రేమ కావాలి అనే చిత్రం వచ్చారు. మీరు ఆదరించారు. ఇప్పుడు తీస్ మార్ ఖాన్ అంటూ ముందుకు రాబోతోన్నాడు. ఈ టీం అందరికీ థాంక్స్. ఇంత మంది మంచి మనుషులు కలిసి ఈ సినిమాను తీశారు. ఈ ఏడాదితో నాకు నటుడిగా 50 ఏళ్లు వస్తాయి. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి.. అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో మన సినిమా కూడా ఉండాలి. మీ ఆశీర్వాదంతో తీస్ మార్ ఖాన్ సినిమా కూడా విజయం సాధించాలి. ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ థాంక్స్. అందరూ చూసి ఈ సినిమాను సక్సెస్ చేయాలి. ఆ సక్సెస్ మీట్‌లో మళ్లీ అందరం కలిసి మాట్లాడుకుందాం. ఆగస్ట్ 19న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి అని అన్నారు.

ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. పిలవగానే ఈవెంట్‌కు వచ్చిన అడివి శేష్, సుధీర్ బాబు, సిద్దులకు థాంక్స్. ఆగస్ట్ 19న తీస్ మార్ ఖాన్ మీ ముందుకు రాబోతోంది. పక్కా కమర్షియల్ చిత్రం. చాలా రోజుల తరువాత అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేస్తున్నాను. మంచి ఎమోషన్‌ ఉంటుంది. మంచి స్క్రిప్ట్. మీకు నచ్చితే ఓ పది మందికి చెప్పండి. పాయల్ మంచి సహనటి. సునీల్ అన్న చేసిన చక్రి అనే పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ అద్భుతంగా నటించారు. నన్ను కొత్తగా ప్రజెంట్ చేసిన కళ్యాణ్‌కు థాంక్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మా సినిమాను నిర్మించిన నాగం తిరుపతి రెడ్డి గారికి థాంక్స్. ఆగస్ట్ 19న ఈ చిత్రం రాబోతోంది. సాయి కార్తిక్ మంచి బీజీఎం ఇచ్చారు. మా కెమెరామెన్ బాలిరెడ్డి, ఫైట్ మాస్టర్ ఇలా పని చేసిన అందరికీ థాంక్స్. సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నారు.

సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. నన్ను ఇక్కడకు పిలిచిన సాయి కుమార్ గారికి థాంక్స్. ఇది వరకు ఆది చేసిన సినిమాలు అన్నింట్లో కెల్లా ఈ చిత్రంలో కొత్తగా అనిపిస్తున్నాడు. కారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. స్క్రీన్ మీద ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తుంది. సాయి కుమార్ సంగీతం బాగుంది. ఈ సినిమాను ఆగస్ట్ 19న థియేటర్లో తప్పకుండా చూడండి అని అన్నారు.

అడివి శేష్ మాట్లాడుతూ.. తీస్ మార్ ఖాన్ సినిమా కుమ్మేయాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ గారు ఫోన్ చేసి రమ్మన్నారు. మా అమ్మ బర్త్ డే ఆగస్ట్ 19. ఈ చిత్రం సక్సెస్‌తో మా అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్‌లో ఆది కుమ్మేశాడు. సినిమాలోనూ కుమ్మేస్తాడు. పాయల్‌ను ఇలా కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి అని అన్నారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ.. తీస్ మార్ ఖాన్ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. పర్ఫెక్ట్ కమర్షియల్ టైటిల్. నేను ఆది కలిసి శమంతకమణి సినిమాను చేశాం. ఆయన అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఆదికి పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తోంది. సాయి కుమార్ గారితో నేను భలే మంచిరోజు చిత్రాన్ని చేశాను. నాకు ఆయన ఆన్ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్‌లో తండ్రిలాంటి వారు. డైరెక్టర్ కళ్యాణ్ గారి మాటలుబట్టి ఈ చిత్రం ఎలా ఉంటుందో అర్థమవుతోంది. ఇలాంటి సినిమాను నిర్మించిన నిర్మాతకు థాంక్స్. నటుడిగా కంటిన్యూ చేస్తూనే నిర్మాతగానూ కొనసాగాలి. సాయి కార్తీక్ సంగీతం నాకు చాలా ఇష్టం. పాయల్ రాజ్‌పుత్ ఓ వేవ్‌లా వచ్చింది.ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

డైరెక్టర్ కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చిన సుధీర్ బాబు, అడివి శేష్, సిద్దులకు థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతకు థాంక్స్. కథ చెప్పగానే నమ్మి నాకు చాన్స్ ఇచ్చారు. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం, సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఎడిటిర్, కెమెరామెన్ ఇలా అందరూ అద్భుతం చేశారు. రాకేందు మౌళి, భాస్కర భట్ల మంచి పాటలు అందించారు. సునీల్ గారి పాత్ర చాలా బాగుంటుంది. ఎప్పుడూ చూడని సునీల్‌ను చూస్తారు.  పూర్ణ గారు అసలు తీస్ మార్ ఖాన్. కబీర్ సింగ్ అద్బుతంగా నటించారు. ఈ సినిమాకు పని చేసినఅందరికీ థాంక్స్. ఇలాంటి సినిమాను తీసిన నిర్మాత గట్స్‌కు హ్యాట్సాఫ్. ఆగస్ట్ 19న అందరూ థియేటర్లో ఈ సినిమాను చూడండి అని అన్నారు.

నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. కళ్యాణ్ స్టోరీ చెప్పగానే సింగిల్ టేక్‌లో ఓకే చెప్పాను. ఆ తరువాత ఆది బాబు దగ్గరకు వెళ్లి ఈ కథ చెప్పాను. ఆయన వెంటనే ఓకే అన్నారు.అయితే ఏ ఒక్క రోజు కూడా ఎవరిని తీసుకుంటున్నారు.. ఏం చేస్తున్నారు అని అడగలేదు. ఆది గారి కెరీర్ బెస్ట్ సినిమా ఇస్తాను అని చెప్పాను. ఒక్క రోజు షూటింగ్ వెళ్లడంతో ఆది బాబుతో నాకు మంచి ర్యాపో ఏర్పడింది. మంచి స్నేహితుడిలా మారిపోయాడు. సాయి కార్తీక్ వల్లే ఈ సినిమాకు బీజం పడింది. పటాస్, రాజా ది గ్రేట్‌లా ఉంటుందని అన్నాడు. సినిమాకు సంగీతంతో ప్రాణం పోయాలని సాయి కార్తీక్‌తో అంటే.. ప్రాణం పెట్టాడు. తీస్ మార్ ఖాన్ అనేది మా టీంకు బెస్ట్ మూవీ అవుతుంది. ఆగస్ట్ 19న ఈ చిత్రం రాబోతోంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఘన విజయం చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. సినిమాను తీయడం చాలా పెద్ద పని. ప్రతీ సినిమాలో  పని చేసే  ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సెట్ అసిస్టెంట్స్ ఇలా అందరికీ థాంక్స్. ప్రతీ సినిమాను వాళ్లే నడిపిస్తారు. సుధీర్ బాబు గారితో ఆ అమ్మాయి గురించి చెప్పాలి అనే చిత్రంలో నటించాను. నేను 50వ ఏట అడుగుపెట్టబోతోన్నాను. ఇన్నాళ్లు నన్ను భరిస్తున్న నా టీంకు థాంక్స్. మా నిర్మాత నాకు టైంకు  డబ్బులు ఇచ్చారు. ఈ సినిమాలో మంచి అవకాశాన్ని ఇచ్చారు. నాకు అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తోన్న దర్శక నిర్మాతలందరికీ థాంక్స్ అని అన్నారు.

పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా సినిమా రిలీజ్ అయ్యే టైంలో కాస్త నర్వస్‌గా ఉంటాను. అది అందరికీ సహజంగానే ఉంటుంది. మా సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నింటికి విశేషమైన స్పందన వచ్చింది. మా సినిమాకు మీ ప్రేమ దక్కినందుకు మాకు సంతోషంగా ఉంది. నేనేమీ స్టార్ కిడ్‌ను కాదు. నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను. అది మీ ప్రేమ, అభిమానం వల్లే చేయగలిగాను. ఈ చిత్రం ఆగస్ట్ 19న రాబోతోంది. ఇది నాకెంతో స్పెషల్. మూడేళ్ల తరువాత నా సినిమా థియేటర్లోకి వస్తోంది. ఇది పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ. ఆది గారు ఎంతో కష్టపడి పని చేశారు. బీజీఎం అద్భుతంగా ఉంటుంది. సాయి గారు మంచి పాటలు అందించారు. ఈ చిత్రంలో ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. అందరూ తప్పకుండా చూడండి. నాకు పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ కళ్యాణ్ గారికి థాంక్స్. ఆదితో పని చేయడం అద్భుతంగా అనిపించింది. మా నిర్మాతకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అలాంటి వ్యక్తిని అరుదుగా చూస్తాం. నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. మేం చాలా కష్టపడి ఈ సినిమాను చేశాం. అందరూ మా సినిమాను చూడండి అని అన్నారు.

Tess Maar Khan pre release event:

Tess Maar Khan movie 19th release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs