Advertisement
Google Ads BL

కార్తికేయ 2 హిందీలో బిగ్ అఛీవ్ మెంట్


ఈ నెల 13 న థియేటర్స్ లలో  విడుదలై విజయవంతంగా  ప్రదర్శింప బడుతున్న  సందర్బంగా కార్తికేయ2 చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా  జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ  నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు,డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత  నవీన్ ఏర్నేని తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా 

Advertisement
CJ Advs

ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..ఈ సినిమాను హిందీ లో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్ లలో  రిలీజ్ చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయి ఈ రోజు 700 థియేటర్స్ లలో ఆడుతుంది. లాంగ్వేజ్ అనే బారికేడ్లను క్రాస్ అయ్యి సినిమా ప్రజల గుండెల్లోకి వెళ్ళింది అంటే సినిమా లో సత్తా లేకపోతె  అన్ని థియేటర్స్ లలో ఆడదు  కదా.. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి అన్నారు 

ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండియా వైజ్ అందరి ప్రేక్షకులకు రీచ్ చేసిన కార్తికేయ 2 సినిమా హోల్ టీం కు కంగ్రాట్స్, ఆగష్టు మంత్ సినిమా ఇండస్ట్రీ కి ఊపిరి పోసిన ప్రేక్షకులకు ధన్యవాదములు. నిఖిల్, చందు  గార్లు నాతో  సినిమా రిలీజ్ గురించి మాట్లాడారు. మాకు ఏ సినిమా అయినా బాగా ఆడితే ముందు మేము ఆనందపడతాము తప్ప మాకు సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి విభేదాలు లేకుండా మేమంతా హెల్టీ అట్మాస్ఫియార్ లో ఉంటాము అని అన్నారు.

చిత్ర నిర్మాత తి. జి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు.. చందు మొండేటి చాలా హార్డ్ వర్క్ చేశాడు. నిఖిల్,అనుపమ మరియు  టీం అలాగే టెక్నీకల్ టీం అందరూ బాగా సపోర్ట్ చేయడం తో సినిమా బాగా వచ్చింది అన్నారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ.. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

అతిధిగా వచ్చిన దర్శకుడు  శ్రీ వాస్ మాట్లాడుతూ.. సినిమా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అందరూ కొత్త యాక్టర్స్ లా చాలా బాగా నటించారు. వీరందరికీ ఇది 2.0 అనుకోవచ్చు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు  చందు మొండేటి మాట్లాడుతూ.. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు. ముఖ్యంగా మా సినిమా ఇంత బాగా రావడానికి  మా టీం  వారికి నా ధన్యవాదములు.టెక్నీకల్ గా అందరూ ఫుల్ కొ ఆపరేట్ చేశారు.షూటింగ్ మొదలు ఎండింగ్ వరకు నాతో ట్రావెల్ చేసిన మణి బాబు కర్ణం, కార్తీక్ ఘట్టమనేని లకు థాంక్స్ చెపుతున్నాను.అలాగే మా చిత్ర నిర్మాతల సహకారం మరువలేనిది. నాకింత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

Karthikeya 2 Success Meet:

Allu Aravind Speech at karthikeya 2 success meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs