Advertisement
Google Ads BL

టిన్ టిన్ బుక్స్ అంటే ఇష్టం: నిఖిల్


నిఖిల్ హీరో గా నటించిన అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత  వస్తున్న  తాజా చిత్రం కార్తికేయ 2..క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది..ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ కు ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 13న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర హీరో నిఖిల్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ

Advertisement
CJ Advs

చందు మొండేటి గారు లైన్ చెప్పిన తరువాత  పార్ట్ 1 కంటే బాగుండాలని చెప్పడంతో  2016లో చందు ఈ కథ చెపితే 2022లో రిలీజ్ ఆవుతుంది. పాండమిక్ వలన లేట్ అవ్వడంతో రెండున్నర సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది. చందు గారు మొదటి సినిమాకంటే ఈ సినిమాకు కథ మాటలు  చాలా బాగా రాసుకున్నాడు.ఇందులో నేను ఒక ఫుల్ టైం డాక్టర్ గా పార్ట్ టైం డిటెక్టివ్ గా నటిస్తున్నాను. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే  దాన్ని అడ్వెంచర్ చేయడానికి వెళ్లే క్యారెక్టర్ లో నటిస్తున్నాను 

ఈ మూవీ హిస్టరీ వర్సెస్ మైథాలజీ గా తీశాము. ప్రతి సీన్ కు ఒక మీనింగ్ ఉంటుంది. మిస్ట్రరీ సస్పెన్స్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. దేవుడు వున్నాడా లేదా అనే వారికి ఈ సినిమా నచ్చుతుంది.దేవుడంటే ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించడం జరిగింది. కొన్ని కొన్ని సీన్స్ కొండల్లో చేయడం జరిగింది. చాలామంది కొండల్లో అంటే గ్రాఫిక్స్ పెట్టిస్తారు. కానీ మేము ప్యాండమిక్ కు ముందు  ప్యాండమిక్ తర్వాత కూడా వెళ్లి కొండల్లో రియల్ గా వెళ్లి తీయడం జరిగింది.

మూవీ కొంత నార్త్ ఇండియా లో జరుగుతుంది కాబట్టి అనుపమ్ ఖేర్ గారిని తీసుకోవడం జరిగింది. తను చాలా గ్రేట్ పర్సన్. తనతో చేసే సీన్స్ కొన్ని నాకు భయంగా అనిపించింది. తను చాలా పెద్ద యాక్టర్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నార్మల్గానే యాక్ట్ చేయడం జరిగింది.ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు. తను ఎక్సలెంట్ కో యాక్ట్రెస్. అలాగే ఇందులో నటించిన  వారందరూ  ఎంతో డెడికేటెడ్ గా నటించారు.

అడ్వెంచర్ కథలైన టిన్ టిన్ బుక్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అవి చందు కూడా చాలా ఇష్టం ఈ బుక్స్ ను నేను బాగా చదివే వాడిని.ఇండియానా జోన్స్ లా మనకు ఎన్నో కథలు ఉన్నాయి. అవన్నీ తీసి ఇండియన్ గ్రేట్ నెస్ ను చూయించాలని  కుంటున్నాము.

ఈ మూవీని అన్ని లాంగ్వేజ్ లలో డబ్ చేస్తున్నాము. అయితే వేరే లాంగ్వేజెస్ లో రిలీజ్ అవ్వడం ఇదే నా మొదటి సినిమా.కాలభైరవ చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.ఇందులో ఉన్న మూడు పాటలు  చాలా బాగుంటాయి. నెక్స్ట్ గీతా ఆర్ట్స్ లోని 18 పేజెస్ సినిమా  పెండింగ్ ఉంది. ఆ తరువాత సుధీర్ వర్మ తో ఒక సినిమా చేస్తున్నాము. స్పై సినిమా ఈ  ఏడాది చివరకు విడుదల అవుతున్న సినిమాను మల్టీ లాంగ్వేజ్ లలో తీస్తున్నాము. నేను తీస్తున్న నాలుగు సినిమాలు కూడా థియేటర్ సినిమాలే. 

ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ అనేది మర్చిపోవాల్సిందే ఎందుకంటే  బ్యాట్స్ మెన్  మూవీ తీసుకుంటే అందులో హీరో, విలన్ కు ఇద్దరికీ ఈక్వల్ క్యారెక్టర్స్ ఉంటాయి. కాబట్టి  మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తాను.నా కెరియర్ స్లోగా పైకి వెళుతుంది తప్ప ఇప్పటి వరకు డౌన్  కాలేదు. ప్రస్తుతం నేను చాలా  హ్యాపీగా ఉన్నాను  అని ముగించారు

Nikhil Interview:

Nikhil Interview about Karthikeya 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs