Advertisement
Google Ads BL

అడ్వెంచరస్ థ్రిల్లర్ కార్తికేయ 2 : చందూ మొండేటి


ప్రేమమ్, సవ్యసాచి, కార్తికేయ‌, చిత్రాలకు దర్శకత్వం వహించి తన కంటూ మంచి గుర్తింపును తెచ్చుకొన్న దర్శకుడు చందూ మొండేటి. తను దర్శకత్వం వహించిన తాజా చిత్రం కార్తికేయ 2. క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని  టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ కు ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 13న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర దర్శకుడు చందు మొండేటి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ... 

Advertisement
CJ Advs

చిన్నప్పటినుండి నేను రామాయణం, మహా భారతం పుస్తకాలు ఎక్కువగా చదవేడిని. ఆలా ఇతిహాసాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వలన కృష్ణతత్వం అనే పాయింట్ తీసుకొని కార్తీకేయ సినిమా చేయడం జరిగింది. దేవుడు అంటే ఒక క్రమశిక్షణ. మనం నమ్మేదంతా కూడా సైన్స్ తో ముడిపడి ఉంటుంది. శ్రీకృష్ణుడు గురించి చెప్పడం అంటే అనంతం. శ్రీకృష్ణుడు ద్వారకలో వున్నాడా లేదా అన్నది ఒక చిన్నపాయింట్. దాన్ని బట్టి ఈ సినిమాను తీయడం జరిగింది. అందుకు కృష్ణ తత్త్వం ను కాన్సెప్ట్ తీసుకొని ఇప్పటితరానికి అయన గొప్పతనం గురించి చెప్పబోతున్నాము. శ్రీకృష్ణుడును మోటివ్ గా తీసుకొని చేసిన ఈ సినిమాలో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. కృష్ణ తత్వం డెఫినిషన్ అర్థమయ్యేలా కొంతవరకు చూయించాను. ఈ మధ్య భక్తి సినిమాలు చూడడానికి ఎవరూ రావడం లేదని భక్తి తో పాటు అడ్వెంచర్ తో కూడుకున్న థ్రిల్లర్ లా ఈ చిత్రాన్ని మలిచాము. ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఒక కొత్త అనుభూతితో థియేటర్స్ నుంచి బయటకు వస్తారు.

కార్తికేయ మంచి హిట్ అవ్వడంతో  ఇప్పుడు వస్తున్న సీక్వెల్ కు  ఆడియన్స్ నుండి బాగా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కార్తికేయలో నిఖిల్ హీరో గా చెయ్యడంతో కార్తికేయ 2 లో నటించడం చాలా ఈజీగా అయ్యింది. అందులో మెడికల్ స్టూడెంట్ గా నటిస్తే ఇందులో డాక్టర్ గా నటించాడు. శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, వైవా హర్ష, సత్య  వీరందరూ బిజీగా ఉన్నా ఈ కథ, కాన్సెప్ట్ నమ్మి, మాతో ట్రావెల్ అయ్యారు. కార్తికేయ 2 లో స్వాతి పాత్ర కు ఎక్కువ స్కోప్ లేదు. అందుకే స్వాతిని తీసుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూడకపోయినా మీకు సెకెండ్ పార్ట్ అర్థమై పోతుంది. హిందీలో మున్నాభాయ్ MBBS తర్వాత వచ్చిన లగే రహో మున్నాబాయి సినిమాలా కొన్ని క్యారెక్టరైజేషన్స్ కంటిన్యూ అవుతాయి కానీ కథ మాత్రం వేరు.

కథ హిమాచల్ ప్రదేశ్ లో నడుస్తున్నందున  అక్కడి వారు అయితే బాగుంటుందని బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్ ను తీసుకోవడం జరిగింది.అయన సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దేవి పుత్రుడు సినిమాకు ఈ కథకు ఎటువంటి సంబంధాలు లేవు 

ఏ కథకైనా నిర్మాతలు కొన్ని బౌండరీస్ ఇస్తారు. దాన్ని బట్టి ఈ కథను చేయడం జరిగింది. కార్తికేయ 2 బడ్జెట్ లో తీయడానికి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడం జరిగింది. అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ గార్లు మమ్మల్ని నమ్మారు. రెండుసార్లు పాండమిక్ సిట్యుయేషన్స్ వచ్చినా వెనుకడుగు వేయకుండా స్క్రిప్ట్ పైన కాన్ఫిడెన్సుతో ఈ సినిమాను తెరకేక్కించారు.

కార్తికేయ రెండు పార్ట్స్ కూడా అడ్వెంచరస్ కాన్సెప్ట్ తో నే తీయడం జరిగింది. ఇందులో కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. కాలభైరవ మ్యూజిక్ హైలెట్ గా ఉంటుంది. అలాగే టెక్నిషియన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. వి.యఫ్.ఎక్స్ వర్క్ చాలా బాగా వచ్చింది.

థియేటర్సులో ప్రేక్షకులకు గ్రాండ్ గా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని  తీసిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఐదు సంవత్సరాలనుండి 15 సంవత్సరాల పిల్లలు చూస్తే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే వారికి ఇతిహాశాలపై  ఒక అవగాహన వస్తుంది 

నేను ఇంకా చెప్పాల్సింది చాలా వుంది. ఆడియన్స్ ఈ చిత్రాన్ని రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ చేస్తాను. ఈ సినిమా తరువాత నెక్స్ట్ గీతా ఆర్ట్స్ లో ఉంటుంది. రెండు కథలు వున్నాయి. ఒకటి ప్రేమకథ. ఇంకొకటి సోషల్ డ్రామా. ఈ రెంటిలో ఏ కథ ముందు అనేది ఫైనల్ కాలేదు. గీతా ఆర్ట్స్ తరువాత నాగార్జునగారితో మరో చిత్రం చేయబోతున్నాను. కరోనా రాకుండా ఉంటే ఇవి ఇప్పటికే సెట్స్ పై ఉండేవి అని ముగించారు.

👉 Read : Karthikeya 3 sensation soon

Chandoo Mondeti Interview:

Chandoo Mondeti Interview about Karthikeya 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs