Advertisement
Google Ads BL

లాల్ సింగ్ చద్దా నుంచి థీమ్ పోస్టర్


అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సింగ్ చెడ్డా. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజు గా కీలక పాత్రలో అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండగా.. గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్ విడుదలైంది. మనం కథలోనా, కథే మనలోనా, ఏంటో ఈ విచిత్రం అనే పదాలుతో తయారైనా ఈ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షక వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Laal Singh Chaddha theme poster released :

Laal Singh Chaddha releasing in theatres worldwide on 11th August
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs