Advertisement
Google Ads BL

మాచర్ల నియోజకవర్గం: ఊర మాస్ ట్రైలర్


హీరో నితిన్ రీసెంట్ మూవీ మాచర్ల నియోజకవర్గం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, మాచర్ల యాక్షన్ ధమ్కీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. గుంటూరులోని బ్రోడీపేట్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మాచర్ల నియోజకవర్గం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. రెండు నిమిషాల యాభై సెకన్లు నిడివి గల మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైండ్  బ్లోయింగ్ అనిపించింది. నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్ గా మొదలైన ట్రైలర్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల పంచిన హాస్యంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ వినోదం అందించింది. 

Advertisement
CJ Advs

కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గా నితిన్ మాచర్లలోకి ఎంటరవ్వడంతో కంప్లీట్ యాక్షన్‌తో మాస్ ఫీస్ట్ గా మెస్మరైజ్ చేసింది. రాజప్ప గా సముద్రఖని విలన్ ఎంట్రీ టెర్రిఫిక్ గా వుంది. మాచర్ల లో రాజప్ప తిరుగులేని శక్తి. తన బలంతో ఎన్నికలే లేకుండా ఎమ్మెల్యే గా ఏకీగ్రీవంగా ఎన్నికౌతుంటాడు. ఐతే నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించి తీరుతానని, కలెక్టర్ అది నా భాద్యతని నితిన్, రాజప్పతో ఛాలెంజ్ చేయడం పవర్ ఫుల్ గా వుంది. నితిన్ క్యాజువల్స్ లో స్టన్నింగా కనిపిస్తూనే ఇన్ బిల్ట్ ఊర మాస్ క్యారెక్టరైజేషన్ బ్రిలియంట్ అనిపించాడు. ముఖ్యంగా డైలాగ్స్ అదిరిపోయాయి. నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పంచ్ లు, వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్.. ఇప్పుడు నేనేం చెయ్యాలి..  రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా ఈ ఒక్క డైలాగ్ వింటే సినిమా ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తోందో అర్ధమౌతుంది.

విజువల్స్, మాస్ డైలాగ్స్ ,క్రాకింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కూడిన యాక్షన్ ట్రైలర్‌ సెన్సేషనల్ గా వుంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. మహతి స్వర సాగర్ ట్రైలర్ కి ఇచ్చిన నేపధ్య సంగీతం పవర్ ప్యాక్డ్ అనిపించింది.

Macherla Niyojakavargam Mass Trailer Released:

Nithiin, Sreshth Movies Macherla Niyojakavargam Oora Mass Trailer Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs